సినిమా వార్తలు

ప్రభాస్ మోస్ట్-అవైటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ ప్రారంభం… క్లాప్ కొట్టిన మెగాస్టార్

Published by
Srinivas

ఇండియ‌న్ సినీ చరిత్రలో అతిపెద్ద సూపర్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ ఘనంగా ప్రారంభమైంది. ముహూర్త వేడుకకు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై మొదటి క్లాప్ కొట్టడం అభిమానులకు డబుల్ సెలబ్రేషన్‌గా మారింది.

పాన్-ఇండియా పవర్‌హౌస్ ట్యాలెంట్‌ను ఏకతాటిపైకి తీసుకొస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ తొలి షూటింగ్ షెడ్యూల్ అధికారికంగా ప్రారంభమైంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సెన్సేషన్‌ హ్యాట్రిక్ హిట్స్ అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, స్పిరిట్ ను ఒక పల్స్-పౌండింగ్, అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

T-సిరీస్ ఫిలిమ్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

ప్రభాస్ – త్రిప్తి దిమ్రి

యానిమల్ లో తన నటనతో మెప్పించిన త్రిప్తి దిమ్రి, ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా నటించనుండటం ఆసక్తిని పెంచింది. ఈ కొత్త ఆన్‌స్క్రీన్ జంట కొత్త కెమిస్ట్రీని తెరపై చూపించనుందని చిత్ర బృందం చెబుతోంది.

వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘సౌండ్-స్టోరీ’ టీజర్‌కు అద్భుత స్పందన

ప్రభాస్‌ జన్మదిన సందర్భంగా విడుదలైన విజువల్స్ లేకుండానే రూపొందించిన “సౌండ్-స్టోరీ” ఆడియో టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ మాత్రమే వినిపించే ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో భారీ చర్చ జరిగింది.

పాన్-వరల్డ్ స్కేల్ – తొమ్మిది భాషల్లో విడుదల

స్పిరిట్ ను ఒక వరల్డ్-క్లాస్ సినీమాటిక్ అనుభూతిగా తీర్చిదిద్దుతున్నారు. చిత్రాన్ని తొమ్మిది ప్రధాన భాషల్లో విడుదల చేయబోతున్నారు. మ్యాసివ్ స్కేల్, యూనివర్సల్ స్టోరీటెల్లింగ్, భారీ యాక్షన్ సెట్‌పీసులు ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని మూవీ బృందం చెప్తోంది.

కెమెరాలు ఇప్పటికే రోల్ అవుతున్నాయి… కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts