సినిమా వార్తలు

‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’కు సెన్సార్ బ్రేక్: సురేష్ గోపి సినిమా విడుదల సందిగ్ధంలో

Published by
Srinivas

ప్రముఖ మలయాళ నటుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మరియు బీజేపీ ఎంపీ సురేష్ గోపి నటించిన తాజా చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ విడుదల ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు అడ్డంకులు ఏర్పడటంతో, విడుదలపై సందిగ్ధత నెలకొందని సమాచారం.

అసలు వివాదం ఏమిటి?

ఈ చిత్రంలో సురేష్ గోపి ఒక న్యాయవాదిగా నటించారు. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఆమె పాత్ర పేరు జానకి. కథ ప్రకారం, లైంగిక వేధింపుల నుంచి బాధపడిన ఒక యువతి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే నేపథ్యంతో ఈ చిత్రం సాగుతుంది. ఈ కథనాన్ని ఆమోదించిన కేరళ సెన్సార్ బోర్డు, మే 22న చిత్రానికి U/A సర్టిఫికేట్ మంజూరు చేసింది.

ముంబై సెన్సార్ హెడ్ ఆఫీస్ అభ్యంతరం

అయితే, తదుపరి రోజు మే 23న ముంబై సెంట్రల్ సెన్సార్ ఆఫీసు నుంచి ఒక షాకింగ్ సూచన వచ్చింది. చిత్రం టైటిల్, అలాగే లైంగిక వేధింపులకు గురైన యువతికి ‘జానకి’ అనే పేరు ఉపయోగించడాన్ని మార్చాలంటూ ఆదేశాలు ఇచ్చారు. రామాయణంలోని సీతాదేవి మరో పేరైన జానకి — దీనిని హిందూ సమాజంలో పవిత్రంగా పరిగణించటం వల్ల, ఆ పేరును ఈ కాంట్రవర్సియల్ కాన్టెక్స్ట్‌లో ఉపయోగించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.

దర్శకుడి తీవ్ర అసహనం

ఈ పరిణామంపై దర్శకుడు ఎంబీ పద్మకుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “చిత్రం కేరళలో సెన్సార్ పూర్తయింది. క్యారెక్టర్ పేరు జానకి అబ్రహం. ముంబై ఆఫీసు నుంచి వాట్సాప్ కాల్స్ చేసి పేరు మార్చాలని ఒత్తిడి చేస్తున్నారు. పేరు జానకి అంటే సమస్య అంటున్నారు. ఇది చట్టబద్ధమైన నిర్ణయమా? కేంద్ర ప్రభుత్వానికి అసలు ఈ విషయం తెలుసా?” అని ఆయన ప్రశ్నించారు.

విడుదలపై సందిగ్ధత

ఈ సినిమా జూన్ 27న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు టైటిల్ మరియు క్యారెక్టర్ పేరుపై మార్పుల ఒత్తిడితో విడుదల వాయిదాపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు సురేష్ గోపి ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts