ఆంధ్ర ప్రదేశ్

రాజకీయ కృష్ణార్జునులు…

Published by
Srinivas

వెండి తెర ఇలవేల్పు గా జనాల చేత నీరాజనాలు అందుకుంటున్న పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” ని, మరో మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ని…. రాజకీయ వర్గాల్లో రాజకీయ కృష్ణార్జునులు గా తెర వెనుక మాట్లాడుకుంటున్నారట….

కారణం ఏమిటంటే…. పని మీద నాదెండ్ల మనోహర్ దగ్గరకు ఎవరైనా వెళ్ళినా, ఆయన మాట ఇవ్వడం లేదట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తరువాతనే ఆ పని ని అన్ని విధాల పరిశీలించిన తరువాతే చేస్తున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏ పనైనా అంతరంగికంగా ఆయనతోను, తన శ్రేయోభిలాషులతోను చర్చించిన తరువాతనే చేస్తున్నారట!

ముందుగా మాట ఇద్దరిలోనూ ఎవ్వరూ ఎవరికీ ఇవ్వడం లేదట. కొంతమంది జనసేన MLAలు కట్టుదాటుతున్నారు అని రిపోర్ట్స్ పవన్ కళ్యాణ్ టేబుల్ మీద ఉన్నాయని…. ఈ మధ్య కాలంలో కొందరు పబ్లిక్ లో అనవసరమైన రాద్దాంతలలో ఇరుక్కుని జనసేన అధినేత వద్ద చివాట్లు తిన్నట్లుగా రాజకీయవర్గాల బోగట్టా…!

ఎవరి జాతకం ఎలా ఉందో కనుక్కుందామని మనోహర్ దగ్గరకు వెళ్ళినా పెదవి విప్పట్లేదట… మొన్నామధ్య ఉత్తరాంధ్ర కి చెందిన ఒక MLA మీద వచ్చిన ఒక ఆరోపణ కి పిలిచి సంజాయిషీ అడిగినట్లు సమాచారం.

కూటమి ప్రభుత్వం రాగల దశాబ్దం పాటు కలసి ఉండాలని జనసేన అధినేత అభిమతం. కొన్ని చోట్ల టీడీపీ మరియు బీజేపీ , జనసేన కార్యకర్తలు ఒకరిమీద ఒకరు సోషల్ మీడియా లో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అవన్నీ ఒక కంట కనిపెడుతూనే వారి వెనుక ఎవరున్నారు…. ఎవరు చేయిస్తున్నారో రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. మనసులో మాట బయట పెట్టకుండా తమ పని తాము చేసుకుంటూ ప్రజల్లో తమదైన శైలిలో ప్రజల నడుమ ఉంటూ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ…. కింది స్థాయి కేడర్ ని బలోపేతం కావిస్తున్నారు.

అందుకే వీళ్ళిద్దరిని రాజకీయ కృష్ణార్జునులు అంటున్నారట.

కొసమెరుపు: ఇద్దరిలో ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జునుడు అంటే… ఒక నవ్వు విసిరి వెళ్ళిపోతున్నారట…. కూటమిలో కొందరు నాయకులు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.