సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సందడి… నాగార్జున, వెంకటేష్, నయనతారలతో సెలబ్రేషన్!

Published by
Srinivas

మెగాస్టార్ చిరంజీవి నివాసం ఈ దీపావళి సందర్భంగా పండుగ వాతావరణంతో కళకళలాడింది. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆయన దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు ఆయన ఆత్మీయ స్నేహితులు నాగార్జున , వెంకటేష్ హాజరై చిరంజీవితో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. వెంకటేష్ భార్య నీరజ, నాగార్జున భార్య అమల కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొని వేడుకకు మరింత అందం చేకూర్చారు.

చిరంజీవి నటిస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రంలోని హీరోయిన్ నయనతార కూడా ఈ దీపావళి వేడుకకు విచ్చేసి మెగా ఇంటిని కాంతులతో నింపేశారు. ముగ్గురు లెజెండరీ నటులు — చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ — ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఈ సందర్భంగా చిరంజీవి తన ఎక్స్ (X) అకౌంట్‌లో అభిమానులతో ఒక సందేశం పంచుకున్నారు:

“నా డియర్ ఫ్రెండ్స్ @iamnagarjuna, @VenkyMama, నా సహనటి #Nayantharaతో కలిసి దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకున్నాను.
ఇలాంటి క్షణాలే మన హృదయాలను సంతోషంతో నింపుతాయి. ప్రేమ, నవ్వులు, ఐక్యత… ఇవే జీవితం నిజంగా వెలుగొందే మూలాలు ”

చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు సూపర్‌స్టార్స్ కలిసి చిరునవ్వులు పంచుకుంటూ ఉన్న ఆ క్షణాలు అభిమానులకు ఒక ప్రత్యేక బహుమతిలా మారాయి.

Srinivas