Download App

ఆదోని నుండి సైకిల్‌పై వీరాభిమాని… చలించిపోయిన మెగాస్టార్

ఆగస్ట్ 29, 2025 By Srinivas
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి, ఈసారి తన వీరాభిమాని కలను నిజం చేసారు. మెగాస్టార్‌ను కలవాలనే జీవితకాల కలతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి సైకిల్‌పై సాహసోపేతంగా హైదరాబాద్ ప్రయాణమయ్యారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు...
ఆదోని నుండి సైకిల్‌పై వీరాభిమాని… చలించిపోయిన మెగాస్టార్

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి, ఈసారి తన వీరాభిమాని కలను నిజం చేసారు.

మెగాస్టార్‌ను కలవాలనే జీవితకాల కలతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి సైకిల్‌పై సాహసోపేతంగా హైదరాబాద్ ప్రయాణమయ్యారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా, చిరంజీవిపై ఉన్న అపారమైన అభిమానం ఆమెను ముందుకు నడిపించింది.

ఆదోని నుండి సైకిల్‌పై వీరాభిమాని… చలించిపోయిన మెగాస్టార్

విషయం తెలుసుకున్న చిరంజీవి, ఆమెను తన నివాసానికి ఆహ్వానించి హృదయపూర్వకంగా పలకరించారు. తనను చేరుకోవడానికి చేసిన అంకితభావం, కృషి చూసి మెగాస్టార్ చలించిపోయారు. ఈ సందర్భంగా రాజేశ్వరి చిరంజీవికి రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకోగా, చిరంజీవి ఆమెకు అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా అందించారు.

అదే సమయంలో, ఆమె పిల్లల విద్యాభవిష్యత్తు కోసం పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు.

ఆదోని నుండి సైకిల్‌పై వీరాభిమాని… చలించిపోయిన మెగాస్టార్

తన అభిమానులను కేవలం అభిమానులుగానే కాక, కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి హృదయానికి ఇది మరొక సాక్ష్యంగా నిలిచింది. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చిరంజీవి ఎందుకు ‘మెగాస్టార్’ అని నిరూపించుకున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading