NBK111: మెజెస్టిక్ క్వీన్‌గా లేడీ సూపర్‌స్టార్
November 18, 2025 Published by Srinivas

వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న హిస్టారికల్ ఎపిక్ #NBK111.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా నయనతార అధికారికంగా చేరారు. కథనానికి కీలకమైన పాత్రలో ఆమె కనిపించనున్నారు. సింహా, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ–నయనతార జోడీగా ఇది నాలుగో చిత్రం కావడం విశేషం. ఈ జంటను మళ్లీ తెరపై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పుట్టినరోజు గిఫ్ట్‌లా మారింది. నయనతార బర్త్‌డే సందర్బంగా ఈ ప్రకటన విడుదలైంది.
మెజెస్టిక్ అనౌన్స్‌మెంట్ వీడియోతో సినిమా స్కేలు, విజువల్ అంబిషన్, గ్రాండ్ టోన్ అద్భుతంగా చూపించారు. ప్రత్యేకంగా గోపీచంద్ మలినేని నయనతారను గుర్రంపై శక్తివంతమైన అవతారంలో పరిచయం చేసిన విధానం ఈ సినిమాకి ఉండబోయే గ్రాండియర్‌ని స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్‌లో కనిపించని విజువల్ వండర్‌లా NBK111 రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని ఫస్ట్ హిస్టారికల్ డ్రామా
కమర్షియల్ మాస్ సినిమాలతో సంచలనాలు సృష్టించిన గోపీచంద్ మలినేని, తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. తన ప్రత్యేక మాస్ టచ్‌ను ఒక గొప్ప చారిత్రక కథలో కలిపి, నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు కనిపించని ఓ కొత్త, శక్తివంతమైన రూపంలో చూపించబోతున్నారు.
ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై, నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్ ప్రస్తుతం పాన్-ఇండియా ప్రాజెక్ట్ “పెద్ది”ను కూడా నిర్మిస్తోంది.
