అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు – తప్పుడు వార్తలు నమ్మవద్దు: నాగబాబు
June 24, 2025 Published by Srinivas

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ మంగళవారం పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికలపై వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే హైదరాబాద్ చేరుకున్నారని, చిరంజీవి తన షూటింగ్ రద్దు చేసుకున్నారన్న కథనాలు వైరల్ అయ్యాయి.
అయితే, ఈ ప్రచారంపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు.
“అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె అనారోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఆస్కారం ఇవ్వవద్దు,” అంటూ ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

గతంలోనూ అనేకసార్లు అంజనాదేవి ఆరోగ్యంపై ఆధారంలేని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరోసారి ఇదే తరహా తప్పుదారిన కథనాలపై నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
