పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ చిత్రీకరణ పూర్తి అయింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించడమే కాదు, పవన్ కళ్యాణ్ గన్‌తో యాక్షన్‌లో దిగిన ఒక అద్భుతమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. వర్షంలో తడుస్తూ, కారు నుంచి బయటికి వచ్చి గన్‌తో ఫైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లుక్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఓజీ’ నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ చిత్రం 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో, పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం 2025లో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా ప్రచారంలోకి వచ్చింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, అలాగే ప్రకాశ్ రాజ్, శ్రియ రెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని ఎస్. తమన్ సమకూరుస్తుండగా, విజువల్స్ పరంగా చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు రవి కె చంద్రన్ మరియు మనోజ్ పరమహంస వంటి ప్రతిభావంతులైన ఛాయాగ్రాహకులు పని చేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి చేపట్టారు.
ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య మరియు కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీలోనే కాదు, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మరింత పెరిగింది.
పవన్ కళ్యాణ్ నిజమైన మాస్ యాక్షన్ మూవీలో కనిపిస్తే, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సునామీ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంచనాలకు తగ్గట్టే రూపొందుతున్న ఈ ‘ఓజీ’ సినిమా, యాక్షన్ ప్రియులతో పాటు ఫ్యాన్స్‌ను సైతం ఊపేసేలా ఉండనుంది.