ఆంధ్ర ప్రదేశ్

కాకినాడ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు: సీఎం చంద్రబాబు సీరియస్

Published by
Rahul N

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఎస్సీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు చదువుతున్న విద్యార్థినులపై కొందరు సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు.

జూలై 8వ తేదీన, కొంతమంది విద్యార్థులు ల్యాబ్ అసిస్టెంట్ మరియు మరో ఉద్యోగి మీద లైంగిక వేధింపులు, అసభ్యకర ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. వారి సెల్‌ఫోన్‌లో విద్యార్థినుల శరీర భాగాల ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు వివరించారు. ఇది గత కొన్ని వారాలుగా జరుగుతోందని, చివరకు బయటపెట్టినట్టు చెబుతున్నారు.

ఈ ఆరోపణలపై కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేపట్టగా, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ విభాగాల్లో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది మద్యం సేవించి విధులకు హాజరవుతుండటం, “మేము శాశ్వత ఉద్యోగులం, మమ్మల్ని ఏం చేయలేరు” అంటూ బెదిరింపులు చేస్తున్నట్టు దాదాపు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు వెల్లడి చేశారు.

వారంతా, “మా భద్రత కోసం ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాతావరణంలో చదవలేకపోతున్నాం” అంటూ వాపోయినట్టు సమాచారం.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. విద్యార్థినుల ఆరోపణలపై వైద్యారోగ్యశాఖ అధికారుల నుంచి పూర్తి నివేదికను కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

Rahul N

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026