ఆంధ్ర ప్రదేశ్

గురుపౌర్ణమి సందర్భంగా తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం: సీఎం చంద్రబాబు ప్రశంసలు

Published by
Rahul N

తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులనే ఆరాధించే సంస్కృతి మన భారతీయ సంప్రదాయం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం వినూత్నంగా మారిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలల్లో 2.28 కోట్ల మంది పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం సంతోషకరమని, ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. “ఈ స్థాయిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరగడం దేశంలోనే ముందుగా మన రాష్ట్రానికే గౌరవం,” అన్నారు చంద్రబాబు.

“నేను మహిళా పక్షపాతిని” అని స్పష్టం చేసిన సీఎం, ప్రతి కార్యక్రమంలోనూ మహిళల్ని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థలను నిర్మించతామని పేర్కొన్నారు. “మగ, ఆడ బిడ్డలను సమానంగా చూసుకోవాలి. అందుకే పిల్లల సంఖ్య ఎంత ఉన్నా, ప్రతి తల్లికి వందనం ఇచ్చాం. తల్లుల పట్ల గౌరవాన్ని పెంపొందించే సంస్కారాన్ని విద్యార్థుల్లో నేర్పిస్తున్నాం” అని తెలిపారు.

“మీ పిల్లల చదువు బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక తల్లిలా విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడతాం” అని సీఎం తెలిపారు.

Rahul N

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026