రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ వచ్చేసింది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. #ప్రభాస్ హను కాన్సెప్ట్ పోస్టర్, ప్రీ-లుక్ తో భారీ అంచనాలను సృష్టించింది.
రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాకు టైటిల్ వచ్చేసింది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్, ప్రీ-లుక్‌తోనే #ప్రభాస్ హను కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫౌజీ టైటిల్ ప్రభాస్ పోషిస్తున్న సైనికుడి పాత్రకు సరైన ప్రతిరూపం. 1940ల కాలం నేపథ్యంలో సాగే ఈ కథలో కాలిపోయిన బ్రిటిష్ జెండా తిరుగుబాటుకు సంకేతంగా నిలుస్తుంది. చుట్టూ వ్యాపించిన అగ్నిజ్వాలలు, అందులో దాగి ఉన్న సంస్కృత శ్లోకాలు, కోడ్ లాంటి చిహ్నాలు ఈ కథలోని మిథాలజికల్, హిస్టారికల్ ఎలిమెంట్స్‌కి సూచనగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని కర్ణుడి లక్షణాలు కలిగిన హీరోని చూపించే తీరు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది.
పోస్టర్‌లో ఉన్న సంస్కృత శ్లోకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అవి చెబుతున్న భావం ప్రకారం — అతను పద్మవ్యుహాన్ని ఛేదించిన అర్జునుడిలా, పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడిలా, గురువులేని యోధుడు ఏకలవ్యుడిలా ఉంటాడు. అతనిలో బ్రాహ్మణుడి జ్ఞానం, క్షత్రియుడి ధర్మం రెండూ మిళితమై ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన యోధుడి రూపాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాయి.
ప్రభాస్‌ను క్లోజప్ షాట్‌లో చూపించిన తీరు విజువల్‌గా అద్భుతంగా ఉంది. అతని కళ్ళలో కనిపించే ఇంటెసిటీ, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఒక సైనికుడి ఆత్మను ప్రతిబింబిస్తాయి. “A Battalion Who Walks Alone” అనే ట్యాగ్‌లైన్ దేశం కోసం ఒంటరిగా పోరాడే యోధుడి కథను స్పష్టం చేస్తోంది.
“ఫౌజీ” టైటిల్ పోస్టర్ అంచనాలకుమించి విజువల్‌గా ఆకట్టుకుంటోంది. ఎమోషన్, గ్రాండ్యూర్ మేళవింపుతో సినిమాలను తెరకెక్కించే హను రాఘవపూడి, ప్రభాస్‌ను ఇంతకు ముందు చూడని పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారు.
ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అనిల్ విలాస్ జాధవ్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు.
పవర్‌ఫుల్ టైటిల్, గ్రేట్ విజువల్ ప్రెజెంటేషన్, టాప్ టెక్నికల్ టీమ్ కలయికతో “ఫౌజీ” ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది.
‘ఫౌజీ’ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.