ప్రభాస్ మోస్ట్-అవైటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ ప్రారంభం… క్లాప్ కొట్టిన మెగాస్టార్
November 24, 2025 Published by Srinivas

ఇండియన్ సినీ చరిత్రలో అతిపెద్ద సూపర్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ ఘనంగా ప్రారంభమైంది. ముహూర్త వేడుకకు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై మొదటి క్లాప్ కొట్టడం అభిమానులకు డబుల్ సెలబ్రేషన్‌గా మారింది.
పాన్-ఇండియా పవర్‌హౌస్ ట్యాలెంట్‌ను ఏకతాటిపైకి తీసుకొస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ తొలి షూటింగ్ షెడ్యూల్ అధికారికంగా ప్రారంభమైంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సెన్సేషన్ హ్యాట్రిక్ హిట్స్ అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, స్పిరిట్ ను ఒక పల్స్-పౌండింగ్, అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
T-సిరీస్ ఫిలిమ్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.
ప్రభాస్ – త్రిప్తి దిమ్రి
యానిమల్ లో తన నటనతో మెప్పించిన త్రిప్తి దిమ్రి, ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా నటించనుండటం ఆసక్తిని పెంచింది. ఈ కొత్త ఆన్‌స్క్రీన్ జంట కొత్త కెమిస్ట్రీని తెరపై చూపించనుందని చిత్ర బృందం చెబుతోంది.
వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘సౌండ్-స్టోరీ’ టీజర్‌కు అద్భుత స్పందన
ప్రభాస్ జన్మదిన సందర్భంగా విడుదలైన విజువల్స్ లేకుండానే రూపొందించిన “సౌండ్-స్టోరీ” ఆడియో టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ మాత్రమే వినిపించే ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో భారీ చర్చ జరిగింది.
పాన్-వరల్డ్ స్కేల్ – తొమ్మిది భాషల్లో విడుదల
స్పిరిట్ ను ఒక వరల్డ్-క్లాస్ సినీమాటిక్ అనుభూతిగా తీర్చిదిద్దుతున్నారు. చిత్రాన్ని తొమ్మిది ప్రధాన భాషల్లో విడుదల చేయబోతున్నారు. మ్యాసివ్ స్కేల్, యూనివర్సల్ స్టోరీటెల్లింగ్, భారీ యాక్షన్ సెట్‌పీసులు ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని మూవీ బృందం చెప్తోంది.
కెమెరాలు ఇప్పటికే రోల్ అవుతున్నాయి… కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
