Peddi: మ్యూజికల్ బ్లాస్ట్ కి రెడీ అవుతోన్న రామ్ చరణ్ ‘పెద్ది’
October 10, 2025 Published by Srinivas

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద అందరికి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు చరణ్ చేస్తున్న అలాంటి మరో విలేజ్ ఎమోషనల్ డ్రామా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈసారి బుచ్చిబాబు కథలో మాస్, ఎమోషన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అన్నీ కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వబోతున్నారట. ఇక సినిమాకు మరో మెజర్ హైలైట్ అంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహ్మాన్ అందిస్తున్న సంగీతం. రెహ్మాన్ మ్యాజిక్ కోసం ఈ మూవీ ఆల్బమ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్ ప్లాన్‌ను ఫైనల్ చేస్తూ, సింగిల్ టీజర్ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించబడిందని టాక్.
ఏ.ఆర్. రెహ్మాన్ ఈ కాంబినేషన్ కోసం ఎలాంటి ట్యూన్ అందించారో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. పాట రసవత్తరంగా క్లిక్ అయితే, ‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే సెన్సేషన్ సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ టాక్.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ భారీ చిత్రాన్ని 2025 మార్చ్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
