Download App

రజనీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌ స్పీడ్‌.. సెకండ్ షెడ్యూల్‌ మొదలు

ఆగస్ట్ 14, 2026 By Srinivas
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధర్మన్’ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌...
రజనీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌ స్పీడ్‌.. సెకండ్ షెడ్యూల్‌ మొదలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధర్మన్’ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

తాజాగా ‘ధర్మన్’ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్‌ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో రజనీకాంత్‌ స్క్రీన్ ప్రజెన్స్‌ అదిరిపోయింది. స్టైలిష్‌ లుక్‌, ఇంటెన్స్‌ యాటిట్యూడ్‌తో కనిపించిన సూపర్ స్టార్‌ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు తొలిసారి నిర్మాత–నటుడిగా ‘ధర్మన్’ కోసం కలిసి పనిచేస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. RKFI బ్యానర్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తొలి చిత్రం కావడం మరో విశేషం. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తన విభిన్నమైన కథా ఆలోచనలు, టేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్‌.. రజనీకాంత్‌ను సరికొత్త కోణంలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా ప్రముఖ నటి సిమ్రాన్ నటిస్తున్నారు. అలాగే తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా కీలక పాత్రలో కనిపించనున్నారు.

సినిమాకు మరో ప్రధాన బలం టెక్నికల్ టీమ్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు జాతీయ అవార్డు గ్రహీతలైన అన్బరివ్ ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, అన్నదురై ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

డిస్నీ సంస్థ ఈ చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది. భారీ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక బృందం, రజనీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్‌తో ‘ధర్మన్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో షెడ్యూల్‌ కూడా ప్రారంభం కావడంతో సినిమా షూటింగ్‌ మరింత వేగం పుంజుకుంది. రాబోయే రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading