సినిమా వార్తలు

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published by
Srinivas

మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపై ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. రవితేజ సరసన ఆషికా రంగనాథ్ మరియు డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇప్పటికే బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న ఫస్ట్ సింగిల్ ‘బెల్లాబెల్లా’ తర్వాత, మేకర్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ గురించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ‘అద్దం ముందు’ అనే సెకండ్ సింగిల్ ను డిసెంబర్ 10న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

రవితేజ, డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ మెలోడీ డ్యూయెట్ ప్రేమోలోనే మంచి స్పందన అందుకుంది. ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ సాంగ్‌పైనే భారీ అంచనాలు పెంచుతోంది. పూర్తి పాట ఎలా ఉండబోతోందన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా, ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 2026 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts