Download App

రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి వేడుక – ఫోటోలు వైరల్!

October 21, 2025 Published by Srinivas

రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి వేడుక – ఫోటోలు వైరల్!

స్టార్ హీరోయిన్ సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. దీపావళి పండుగ సందర్భంగా సమంత, రాజ్ మరియు ఆయన కుటుంబంతో కలిసి పండగ జరుపుకున్న ఫోటోలు సమంత తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది.

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో ఆమెకు ఉన్న సన్నిహిత సంబంధం గురించి వస్తున్న వార్తలు, సమంత చేసిన లేటెస్ట్ పోస్ట్ తో మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.

సమంత ఆ వేడుకలో పటాసులు కాలుస్తున్న ఫోటోలు, రాజ్ నిడిమోరు కుటుంబంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి ఆమె “My heart is filled with gratitude.” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై నెటిజన్లు ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు.

రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి వేడుక – ఫోటోలు వైరల్!

ఇటీవల వీరిద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం కూడా అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచింది.

‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’ మరియు ‘సిటాడెల్: హనీ బన్నీ’ షూటింగ్ సమయంలోనే సమంతకు రాజ్-డీకే జంటతో స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు రాజ్ కానీ సమంత కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ రూమర్స్ మధ్య కూడా సమంత తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ప్రస్తుతం సమంత చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న “మా ఇంటి బంగారం” సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అదే కాకుండా, ఆమె “రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్” అనే మరో ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading