సినిమా వార్తలు

నటిగా మారుతున్న సింగర్

Published by
Rahul N

సింగర్లు హీరోయిన్లుగా మారడం కొత్తేం కాదు. మమతా మోహన్ దాస్, శృతిహాసన్ లాంటి హీరోయిన్లు తమ కెరీర్ ను సింగర్స్ గానే ప్రారంభించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో అమ్మాయి చేరింది పేరు అదితి భావరాజు.

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ ఆల‌పించిన అదితి, సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది. ‘దండోరా’ చిత్రంలో ఆమె తన యాక్టింగ్ టాలెంట్ చూపించబోతోంది. అదితి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ఫోటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని.. ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ సినిమా తీశాడు. ఇప్పుడు ‘దండోరా’ సినిమా నిర్మిస్తున్నారు. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమాలో అదితి భావరాజు నటిస్తోంది.

గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు సమాజంలో ఉన్న కొన్ని నిజాలు, కొన‌సాగుతోన్న సామాజిక దుష్ర్పవర్తనల్ని చూపించబోతున్నారు. ఇందులో శివాజీ, న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

Rahul N

Recent Posts