మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #SSMB29 Globe Trotter ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి చేస్తున్న “Globe Trotter” (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని 120 దేశాల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా కీలకమైన ఆఫ్రికా షెడ్యూల్ కెన్యాలో శరవేగంగా జరుగుతోంది. ప్రియాంకా చోప్రా ఇటీవలే తన ఫ్లైట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆఫ్రికా ప్రయాణం చేసినట్లు సూచించగా, అధికారికంగా కెన్యా ప్రైమ్ కేబినెట్ సెక్రటరీ & ఫారిన్ అఫైర్స్ మంత్రిగా ఉన్న ముసాలియా డబ్ల్యూ. ముడవడి ఈ విషయాన్ని ధృవీకరించారు. రాజమౌళి, నిర్మాత కె.ఎల్. నారాయణను కలిసిన ఫొటోలను ఆయన విడుదల చేస్తూ – దాదాపు 95% ఆఫ్రికా సన్నివేశాలు కెన్యాలోనే చిత్రీకరిస్తున్నారని ప్రకటించారు.
120 మంది టెక్నీషియన్లతో కూడిన రాజమౌళి బృందం ఈస్ట్ ఆఫ్రికా అంతా లొకేషన్లను పరిశీలించి, చివరికి కెన్యానే ప్రధాన చిత్రీకరణ కేంద్రంగా ఎంచుకుంది. షూటింగ్‌లో బిజీగా ఉండటంతో మహేష్ బాబు ఈ ఏడాది తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజుకీ, వినాయక చవితికీ కుటుంబంతో కలిసి ఉండలేకపోయారు.
“Globe Trotter” ప్రపంచాన్ని చుట్టే అడ్వెంచర్ స్టోరీగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. నవంబర్‌లో స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా 2027 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.