Download App

#SSMB29: 120 దేశాల్లో విడుదలకు భారీ ప్లానింగ్

September 3, 2025 Published by Rahul N

#SSMB29: 120 దేశాల్లో విడుదలకు భారీ ప్లానింగ్

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #SSMB29 Globe Trotter ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుతోంది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి చేస్తున్న “Globe Trotter” (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని 120 దేశాల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా కీలకమైన ఆఫ్రికా షెడ్యూల్ కెన్యాలో శరవేగంగా జరుగుతోంది. ప్రియాంకా చోప్రా ఇటీవలే తన ఫ్లైట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆఫ్రికా ప్రయాణం చేసినట్లు సూచించగా, అధికారికంగా కెన్యా ప్రైమ్ కేబినెట్ సెక్రటరీ & ఫారిన్ అఫైర్స్ మంత్రిగా ఉన్న ముసాలియా డబ్ల్యూ. ముడవడి ఈ విషయాన్ని ధృవీకరించారు. రాజమౌళి, నిర్మాత కె.ఎల్. నారాయణను కలిసిన ఫొటోలను ఆయన విడుదల చేస్తూ – దాదాపు 95% ఆఫ్రికా సన్నివేశాలు కెన్యాలోనే చిత్రీకరిస్తున్నారని ప్రకటించారు.

#SSMB29: 120 దేశాల్లో విడుదలకు భారీ ప్లానింగ్

120 మంది టెక్నీషియన్లతో కూడిన రాజమౌళి బృందం ఈస్ట్ ఆఫ్రికా అంతా లొకేషన్లను పరిశీలించి, చివరికి కెన్యానే ప్రధాన చిత్రీకరణ కేంద్రంగా ఎంచుకుంది. షూటింగ్‌లో బిజీగా ఉండటంతో మహేష్ బాబు ఈ ఏడాది తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజుకీ, వినాయక చవితికీ కుటుంబంతో కలిసి ఉండలేకపోయారు.

Rajamouli Massive planning for SSMB29 to release in 120 countries

“Globe Trotter” ప్రపంచాన్ని చుట్టే అడ్వెంచర్ స్టోరీగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. నవంబర్‌లో స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా 2027 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading