
పెద్ద హీరోల సరసన నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు..? అలాంటిది గ్లోబల్ స్టార్ స్టార్ రాంచరణ్ తో అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. అందుకు విరుద్ధంగా, మలయాళ నటి స్వాసిక మాత్రం ఆయన కొత్త సినిమా పెద్దిలో నటించే అవకాశాన్ని తానే స్వయంగా తిరస్కరించానని వెల్లడించారు.
ఈ విషయాన్ని స్వాసిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పగా, అది సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే, పెద్ది చిత్రంలో రామ్ చరణ్ కు తల్లిగా నటించే పాత్రకు స్వాసికను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె వయసు ప్రస్తుతం 33 ఏళ్లు కాగా, రామ్ చరణ్ వయసు 40 ఏళ్లు. అంటే హీరోకన్నా ఏడు సంవత్సరాలు చిన్నదైన స్వాసికను ఆయన తల్లిగా తీసుకోవాలని అనుకోవడంతో, ఆమెకు ఆ పాత్ర ఇబ్బందిగా అనిపించిందట. తమిళం, మలయాళంలో ఇప్పటికే మధ్యవయసు పాత్రలు చేసినప్పటికీ, ఈ దశలో తల్లి పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.

అందుకే పలుమార్లు ఒప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ, తాను స్పష్టంగా “నో” చెప్పాల్సి వచ్చిందని స్వాసిక తెలిపారు.
గతంలో స్వాసిక, నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో కనిపించారు. రామ్ చరణ్ సినిమాను తిరస్కరించిన విషయంపై ఆమె చేసిన ఈ ప్రకటన కొంతమంది అభిమానులకు అసహనంగా మారింది.
ఇక పెద్ది సినిమాను బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్ ఓ క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ తో పెద్ది అంచనాలు అమాంతం పెరిగాయి.
