Download App

మిరాయ్ ఫస్ట్ సింగిల్‌ ‘వైబ్ ఉంది’తో తెగ వైబ్ ఇచ్చిన తేజ సజ్జా!

జూలై 26, 2025 • By Rahul N
హనుమాన్ విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్న తేజ సజ్జా, ఈసారి సూపర్ యోధగా మిరాయ్ లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, ఇప్పుడు విడుదలైన ఫస్ట్ సింగిల్ "వైబ్ ఉంది" ఆ అంచనాలకు మించి వైబ్ ఇస్తోంది. ఈ పాట మొదటి...
మిరాయ్ ఫస్ట్ సింగిల్‌ 'వైబ్ ఉంది'తో తెగ వైబ్ ఇచ్చిన తేజ సజ్జా!

హనుమాన్ విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్న తేజ సజ్జా, ఈసారి సూపర్ యోధగా మిరాయ్ లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, ఇప్పుడు విడుదలైన ఫస్ట్ సింగిల్ “వైబ్ ఉంది” ఆ అంచనాలకు మించి వైబ్ ఇస్తోంది.

మిరాయ్ ఫస్ట్ సింగిల్‌ 'వైబ్ ఉంది'తో తెగ వైబ్ ఇచ్చిన తేజ సజ్జా!

ఈ పాట మొదటి నోట్ నుంచే ఉత్సాహాన్ని నింపుతుంది. అకార్డియన్లు, సాక్సోఫోన్లు, డ్రమ్స్ మేళవింపుతో సాగే ఈ మ్యూజికల్ ఫీస్ట్, ఓ సెలబ్రేషన్ మూడ్‌ను సృష్టిస్తుంది. కృష్ణ కాంత్ లిరిక్స్‌లో తెలుగు–ఇంగ్లీష్ మిళితం సూపర్‌గా సరిపోయి హీరో ప్రేమభావాలను సరికొత్త స్టైల్లో చూపిస్తున్నాయి.

అర్మాన్ మాలిక్ వాయిస్ ఈ పాటకు హైలైట్. ఆయన మధురమైన, ఎనర్జిటిక్ రేండిషన్ పాటకు ప్రాణం పోశాయి.

మిరాయ్ ఫస్ట్ సింగిల్‌ 'వైబ్ ఉంది'తో తెగ వైబ్ ఇచ్చిన తేజ సజ్జా!

విజువల్స్ విషయానికి వస్తే తేజ సజ్జా పూర్తిగా లైవ్ వైర్! స్టైలిష్ లుక్‌తో, చక్కని డాన్స్ మూవ్స్‌తో ఫ్రేమ్ మొత్తం ఎనర్జీతో నింపేశారు. రిథికా నాయక్ గ్లామరస్‌గా కనబడుతూ తేజతో కలసి అద్భుత కెమిస్ట్రీని చూపించింది.

అర్బన్ సెటప్, మోడర్న్ కలర్ ప్యాలెట్, గ్లోయింగ్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ ఈ పాటను మరింత స్టైలిష్‌గా మార్చాయి.

ఎనర్జిటిక్ బీట్‌లు, స్టైలిష్ విజువల్స్, తేజ–రిథికాల కెమిస్ట్రీ ఈ సాంగ్‌ను చార్ట్‌బస్టర్‌గా నిలబెడతాయి.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading