Download App

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్: తిరువీర్, టీనా శ్రావ్య జంట ఫుల్ ఫన్ & ఎంటర్‌టైన్‌మెంట్!

అక్టోబర్ 31, 2025 By Rahul N
వెర్సటైల్ నటుడు తిరువీర్, చురుకైన నటి టీనా శ్రావ్య జంటగా నటించిన వినోదభరిత చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కామెడీ, కన్ఫ్యూజన్, ఎమోషన్‌ల మేళవింపుతో రూపొందించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథగా, నవ్వులు...
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్: తిరువీర్, టీనా శ్రావ్య జంట ఫుల్ ఫన్ & ఎంటర్‌టైన్‌మెంట్!

వెర్సటైల్ నటుడు తిరువీర్, చురుకైన నటి టీనా శ్రావ్య జంటగా నటించిన వినోదభరిత చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కామెడీ, కన్ఫ్యూజన్, ఎమోషన్‌ల మేళవింపుతో రూపొందించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథగా, నవ్వులు పూయించే హాస్యభరిత సన్నివేశాలతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

హీరో తిరువీర్ ఫోటోగ్రాఫర్‌గా, ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో ఎదురయ్యే సరదా గందరగోళం ఈ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ మొత్తం ఫ్రెష్ విజువల్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్, నేచురల్ హ్యూమర్‌తో నిండిపోయి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వాతావరణం సృష్టిస్తోంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ట్రైలర్ చూస్తే — పెళ్లి చూపుల సందర్భంలో కుర్రాడు అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని కోరుకుంటాడు. గ్రామంలోనే ఉత్తమ ఫోటోగ్రాఫర్ కోసం వెతుకుతుండగా కథానాయకుడు ప్రవేశిస్తాడు. షూట్ అంగీకరించిన హీరో ఫోటోలు తీసే క్రమంలో ఎదురయ్యే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే అసలు ట్విస్ట్ – షూట్‌లో మెమరీ కార్డ్ లేకపోవడం! ఆ సమస్యను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? దానివల్ల ఏం జరిగిందన్నదే సినిమాకు కేంద్రమైన అంశం.

దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఈ కథను హాస్యప్రధానమైన సన్నివేశాలతో తీర్చిదిద్దారు. ట్రైలర్‌లో కనిపిస్తున్న ఫ్రెష్ విజువల్స్, కామెడీ సీక్వెన్సులు, బీజీఎం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతున్నాయి.

సంగీతం సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ కె. సోమశేఖర్ అందించారు. గ్రామీణ నేపథ్యంలోని ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా, సిట్యుయేషనల్ కామెడీతో నిండుగా సాగనుందని చిత్రబృందం చెబుతోంది.

7PM మరియు పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు.

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ – ఫోటోగ్రాఫర్ రమేష్ (తిరువీర్) పాత్రలో నవ్వులు పంచుతూ, ప్రేమ, హాస్యం, ఎమోషన్‌ల మేళవింపుతో ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది.

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన వినోదభరిత చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading