Download App
Movie Poster

Junior

Cast: Kireeti, Genelia, Sreeleela, Krithi Reddy, V Ravichandran, Rao Ramesh, Sudharani, Viva Harsha

Director: Radha Krishna Reddy

Music Director: Devi Sri Prasad

Producer: Rajani Korrapati

Banner: Vaaraahi Chalana Chitram

Release Date: July 18, 2025

జూనియర్ మూవీ రివ్యూ

Published జూలై 18, 2025 by Srinivas

జూనియర్ రివ్యూ: నాన్నగారింటికి దారేది తమ్ముడూ… ఓ శ్రీమంతుడు!

కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘జూనియర్’. జెనీలియా ఇంపార్టెంట్ రోల్ చేసింది. హీరో గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కావడంతో టాప్ టెక్నీషియన్లతో సినిమా తీశారు. విడుదలకు ముందు వైరల్ వయ్యారి హిట్ కావడం ప్లస్ అయ్యింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం నిర్మించిన సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.

Junior Movie Review

కథ:

అభినవ్ (గాలి కిరీటి రెడ్డి)కి తండ్రి కోదండపాణి (రవిచంద్రన్) చూపించే అతి ప్రేమ నచ్చదు. నాన్నకు దూరంగా జీవించాలని, నచ్చినట్టు ఉండాలని అతని కోరిక. బీటెక్ కాలేజీలో చేరతాడు. స్ఫూర్తి (శ్రీలీల)ను చూసి ప్రేమిస్తాడు. ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే అభినవ్, తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం చూసి స్ఫూర్తి షాక్ అవుతుంది. ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేద్దామని అంటుంది. కాలం గిర్రున తిరిగి బీటెక్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇద్దరూ ఉద్యోగంలో చేరతారు. 

ఆఫీసులో జాయినింగ్ రోజే బాస్ విజయ (జెనీలియా) కళ్ళలో పడతాడు అభినవ్. అతడు చేసిన పని ఆమెకు నచ్చదు. కళ్ళముందు ఉండకూడదని వేరే ఫ్లోర్‌కు పంపిస్తుంది. అభినవ్ చేసిన మరో పని వల్ల ఉద్యోగం నుంచి తీసేయాలని డిసైడ్ అవుతుంది. అటువంటి అభినవ్, విజయ కలిసి విజయనగరం ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? అభినవ్ చేసిన ఏ పని వల్ల విజయకు కోపం వచ్చింది? ఒకరి గురించి మరొకరు తెలుసుకున్న నిజం ఏమిటి? అనేది మిగతా కథ. 

Junior Movie Review

విశ్లేషణ:

కమర్షియల్ సినిమాల్లో కథ ఆశించడం అత్యాశే. హీరో ఇంట్రడక్షన్ ఫిల్మ్ అయితే కుర్రాడు అన్నీ చేయగలడని చెప్పడానికి ఫైట్స్, డ్యాన్స్, ఎమోషన్ సీన్స్, లవ్ ట్రాక్, కామెడీ మిక్స్ చేస్తారు. ఫార్ములాను ఫాలో అవుతూ తీసే సినిమాల్లో కాస్త కథ, ఆ కథకు తలాతోకా ఉండాలి కదా! ‘జూనియర్’లో అటువంటివి ఏవీ లేవ్.

వెరీ వెరీ సింపుల్‌గా చెప్పాలంటే తమ్ముడిగా మారిన శ్రీమంతుడు ఈ ‘జూనియర్’. నాన్నగారింటికి దారేది అంటూ అక్కను తీసుకొచ్చిన తమ్ముడు ఈ ‘జూనియర్’. ఈ కథ మీద నాన్న ప్రేమ షుగర్ కోటింగ్ మాత్రమే. లోపల అక్కను నాన్నను ఒక్కటి చేయాలని తమ్ముడు పడిన తపన, అక్కకు అడ్డొచ్చిన విలన్స్ (సినిమా చూసిన సారీ ఆడియన్స్ విలన్ ఎక్కడ? అని కోప్పడే ప్రమాదం ఉంది) భరతం పట్టి ఆవిడ పని పూర్తి చేసిన శ్రీమంతుడు లాంటి తమ్ముడి వీరత్వం ఉన్నాయి. మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ ఓకే ఓకే అనిపించాయి. 

Junior Movie Review

పొరపాటున కొత్త సీన్ రాస్తే ఆడియన్స్ ఎక్కడ అప్రిషియేట్ చేస్తారోనని ఓల్డ్ ఫార్మాట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డిని టాలీవుడ్ మర్చిపోవడం మంచిది. ‘జూనియర్’ మొదలు నుంచి తుది వరకు హిట్ సినిమాలు గుర్తుకు తెచ్చారు ఆయన. కథలో విషయం లేకపోవడంతో దేవిశ్రీ ప్రసాద్ కూడా రొటీన్ సాంగ్స్ కొట్టారు. ఒక్క వైరల్ వయ్యారి తప్ప. నేపథ్య సంగీతంలో ఓల్డ్ దేవిని గుర్తు చేశారు. సెంథిల్ సినిమాటోగ్రఫీకి వంక పెట్టలేం. సాయి కొర్రపాటి గట్టిగా ఖర్చు పెట్టారు.

హీరో కిరీటి రెడ్డి డ్యాన్స్ బాగా చేశాడు. ఈ కుర్రాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. రిలీజ్ ముందు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కథలో సీన్స్ మహేష్ బాబు మూవీస్ గుర్తు చేస్తే కిరీటి డ్యాన్స్ ఎన్టీఆర్ స్టెప్స్‌ను గుర్తు చేశాయి. ఫైట్స్ కూడా బాగా చేశాడు. యాక్టింగ్, స్టైలింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. శ్రీలీలది కూరలో కరివేపాకు లాంటి క్యారెక్టర్. వైరల్ వయ్యారి పాటలో బావుంది. మిగతా సీన్స్ సోసోగా చేసింది. రవిచంద్రన్, రావు రమేష్ సీనియర్ ఆర్టిస్టులు. వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్స్ లేకుండా యాక్ట్ చేశారు. సత్య, హర్ష కామెడీ కొంత పర్వాలేదు. 

తీర్పు:

అక్క యాంగిల్ నుంచి, కథకు సినిమాకు ‘నాన్న గారింటికి దారేది తమ్ముడూ… శ్రీమంతుడు’ టైటిల్ యాప్ట్! సినిమాలో హీరో మెమరీస్ గురించి చెప్తుంటాడు. డాన్సులు, ఫైటుల్లో కిరీటికి ‘జూనియర్’ మంచి మెమరీ. కానీ హిట్ సినిమా కాదు. మెమరీ లోంచి డిలీట్ చేయవచ్చు. కథలో చివరకు కొడుకును నాన్న మర్చిపోయాడు. సినిమాను ఆడియన్స్ మర్చిపోతారు.

Rating: (2/5)

మరిన్ని వార్తలు

No categories found.