Download App
Movie Poster

Baahubali The Epic

Cast: Prabhas, Rana Daggubati, Anushka Shetty, Tamannaah Bhatia, Ramya Krishna, Sathyaraj, Nasser, Kiccha Sudeepa, Adivi Sesh, Rakesh Varre, Meka Ramakrishna

Director: SS Rajamouli

Music Director: MM Keeravani

Producer: Sobhu Yarlagadda, Prasad Devineni

Banner: Arka Media Works

Release Date: October 31, 2025

‘Baahubali The Epic’ Review: ‘బాహుబలి ది ఎపిక్’ మూవీ రివ్యూ

Published అక్టోబర్ 31, 2025 by Srinivas

‘బాహుబలి ది ఎపిక్’ రివ్యూ: స్పెషల్ ఫ్యాక్టర్ ఏముంది?

రీ రిలీజ్ ట్రెండ్‌లలో ‘బాహుబలి ది ఎపిక్’ కొత్త ప్రయోగం. రెండు భాగాలను ఒక్కటిగా చేసి థియేటర్లలో విడుదల చేశారు రాజమౌళి. ఈ ఎపిక్ ఎటువంటి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది? అనేది తెలుసుకోండి.

ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్ చేసిన క్యారెక్టర్ ‘బాహుబలి’. రెండు భాగాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆ రెండిటినీ ఒక్కటి చేసి ‘బాహుబలి: ది ఎపిక్’గా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. ఈసారి ఆయన ఎటువంటి మాయాజాలం సృష్టించారు? ఎపిక్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది?

'Baahubali The Epic' Review: స్పెషల్ ఫ్యాక్టర్ ఏముంది?

కథ:

ప్రేక్షకులు అందరికీ తెలిసిన కథను క్లుప్తంగా చెప్పాలంటే… అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)ను మోసం చేసి, కుయుక్తులు – పన్నాగాలతో మాహిష్మతి సింహాసనం అధిష్టిస్తాడు భల్లాలదేవ (రానా దగ్గుబాటి). తమ్ముడు తనకు ఎక్కడ అడ్డొస్తాడోనని తల్లి శివగామి (రమ్యకృష్ణ) మనసులో బాహుబలిపై ద్వేషం కలిగేలా చేస్తాడు. చంపించేలాపథకం రచిస్తాడు. తమ్ముడు మరణం తర్వాత దేవసేన (అనుష్క)ను బందీగా చేస్తాడు. బాహుబలి, దేవసేన దంపతుల కుమారుడు మహేంద్ర బాహుబలి (ప్రభాస్) మాహిష్మతికి ఎలా వచ్చాడు? తల్లిని ఎలా విడిపించాడు? తండ్రి మరణానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? అనేది సినిమా. 

విశ్లేషణ:

రీ రిలీజ్ ట్రెండ్ గమనిస్తే… ఛార్ట్ బస్టర్ సాంగ్స్ లేదా అభిమానులకు హై ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమాలకు ఆదరణ బావుంది. తమిళ్ డబ్బింగ్ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, తెలుగులో పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ – ‘ఖుషి’ వంటి ప్రేమకథలు… ‘సలార్’ వంటి యాక్షన్ ఫిలిమ్స్ రీ రిలీజ్‌లలో ట్రెండ్ క్రియేట్ చేయడానికి రీజన్ అదే. అభిమానులకు సాంగ్స్, యాక్షన్ హై ఇచ్చాయి గనుక.

అభిమానులకు కిక్ ఇచ్చే యాక్షన్ ‘బాహుబలి’లో లేదు. పాటలు బావుంటాయ్ కానీ అభిమానులు పాడుకునేలా ఉండవు. బాహుబలి డైరెక్టర్ సినిమా. ఎమోషనల్ డ్రామా పండిన సినిమా. అందువల్ల, రెండు పార్టులు మళ్ళీ ఎలా ఒక్కటి చేశారు? అనే ఎగ్జైట్‌మెంట్ నెలకొంది. కొత్త సీన్స్ యాడ్ చేస్తారని ప్రచారం జరిగినా ఆ అంశంలో ముందు క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. సో, తెలిసిన కథను కొత్తగా చెప్పారా అంటే అదీ లేదు. కథకుడిగా రాజమౌళి కొత్తగా చూపించిన ప్రతిభ లేదు. సంగీత దర్శకుడిగా కీరవాణి చూపించిన ప్రతిభ కారణంగా ఇప్పటికీ కొన్ని సీన్స్ హై ఇచ్చాయ్.

'Baahubali The Epic' Review: స్పెషల్ ఫ్యాక్టర్ ఏముంది?

‘బాహుబలి: ది ఎపిక్’ గురించి చెప్పాలంటే… ఫస్టాఫ్ ‘ది బిగినింగ్’, సెకండాఫ్ ‘ది కంక్లూజన్’. తమన్నా ప్రేమకథ, పచ్చబొట్టు పాట కట్ చేసినా ‘ఎపిక్’ ఫస్టాఫ్ నిడివి ఎక్కువైంది. అప్పట్లో ‘ది కంక్లూజన్‌’లో ఏయే సన్నివేశాలు హై ఇచ్చాయో, ఇప్పుడు ‘ఎపిక్’ సెకండాఫ్‌లో సేమ్ సీన్స్ హై ఇచ్చాయి. కీరవాణి సంగీతం వెన్నుముకలా, ఆయువుపట్టులా నిలిచింది. హై మూమెంట్స్ రావడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది.

తీర్పు:

‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి కారణం అందులో ఎమోషనల్ డ్రామా. యాక్షన్ సీన్స్ కాదు. రీ రిలీజ్ ట్రెండ్స్‌లో ఎమోషనల్ డ్రామాల కంటే హై ఇచ్చే యాక్షన్ సీన్స్ కీ రోల్ పోషించాయి. ఇప్పుడీ సినిమాకూ ‘ది కంక్లూజన్‌’లో ఎమోషన్స్ కంటే యాక్షన్ సీన్స్ సెకండాఫ్‌లో హై ఇచ్చాయి. ఇంటర్వెల్ ముందు నిడివితో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ తర్వాత ‘హై’లోకి వెళతాం. ప్రభాస్, జక్కన్న ఫ్యాన్స్ నాలుగు గంటలు థియేటర్లలో కూర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యి వెళ్లడం మంచిది. నో స్పెషల్ ఫ్యాక్టర్… ఓన్లీ యాక్షన్ & ఎమోషనల్ ‘హై’.

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.