The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్

Published by
Srinivas

ది గర్ల్ ఫ్రెండ్ రివ్యూ: మగాడికీ పరువు ఉంటుంది కదా!

రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీక్షిత్ శెట్టి హీరో. ఈ సినిమా ఎలా ఉందనేది సమీక్షలో తెలుసుకోండి.

రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ప్రేమకథ ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. అల్లు అరవింద్ సమర్పించిన చిత్రమిది. విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. ఈ సినిమా ఎలా ఉందనేది సమీక్షలో తెలుసుకోండి. 

కథ

కథ గురించి చెప్పాలంటే… భూమా (రష్మిక), విక్రమ్ (దీక్షిత్ శెట్టి) పీజీ విద్యార్థులు. ఆ అమ్మాయిని చూసి అబ్బాయి ప్రేమిస్తాడు. అమ్మాయీ ప్రేమిస్తుంది. అయితే ఆ ప్రేమ వద్దనుకుంటుంది. ఎందుకు? అబ్బాయి ప్రేమలో లోపం ఉందా? అమ్మాయి ఆలోచన తప్పు ఉందా? ఎవరి పరువును తీసేలా ఎవరు ప్రవర్తించారు? కన్న కుమార్తెపై భూమా తండ్రి (రావు రమేష్) ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? ఈ కథ ఎటు తిరిగి ఎటు వెళ్ళింది? అనేది సినిమా. 

విశ్లేషణ:

సినిమా ఎలా ఉందంటే… తరతరాలుగా సభ్య సమాజం కొన్ని కట్టుబాట్లు, సంసార జీవితంలో పడికట్టు సంబంధాలకు చోటు ఇచ్చింది. కాలంతో పాటు కట్టుబాట్లకు చెల్లుచీటి పాడాల్సిన సమయం వచ్చిందని అభ్యుదయ భావాలు కల వ్యక్తులు చెబుతుంటారు. మహిళల దృష్టిలో అటువంటి అభ్యుదయ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. 

మహిళల అభిప్రాయాలకు విలువ, గౌరవం ఇవ్వాలని చెప్పడం రాహుల్ రవీంద్రన్ ఉద్దేశం కావచ్చు. మొదటి నుంచి చిన్న చిన్న సన్నివేశాల ద్వారా అది చెబుతూ వచ్చారు. మహిళలు సంతోషంగా ఉన్నారో లేదో మగాళ్లు పట్టించుకోరని సిగ్నల్స్ ఇస్తూ వెళ్లారు. మహిళలు అసౌకర్యంగా ఫీలయ్యే విషయాలను గమనించరన్నట్టు చూపించారు. అయితే పతాక సన్నివేశాల్లో పూర్తిగా మహిళల పక్షపాతిగా మారారు. మహిళలకు గౌరవం ఇవ్వమని చెప్పడంలో, అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని అనడంలో తప్పు లేదు. పతాక సన్నివేశాల వల్ల సమాజంపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలి. రాహుల్ రవీంద్రన్ ఉద్దేశం సరైనదే. కాని అందులో తప్పును నవతరం మగువ ఒప్పుగా స్వీకరించే ప్రమాదం ఉంది. కథాంశాన్ని పక్కన పెడితే దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. సాంకేతిక వనరులను చక్కగా ఉపయోగించుకున్నారు. పాటలు, నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బావున్నాయి. పాటల కంటే నేపథ్య సంగీతం ఎక్కువ ఆకట్టుకుంటుంది.

రష్మిక నటనలో మౌనం ఎక్కువ భావోద్వేగాలు పలికించింది. చెమర్చిన కళ్లు మాట్లాడాయి. రష్మికతో సమానమైన నటన దీక్షిత్ శెట్టి కనబరిచారు. ఇద్దరి అద్వితీయమైన నటన సన్నివేశాలను అద్భుతంగా మార్చాయి. రావు రమేష్, రోహిణి కనిపించిన సన్నివేశాలు తక్కువ. నటనతో చూపించిన ప్రభావం ఎక్కువ.

తీర్పు:

మగాడికీ పరువు ఉంటుంది. కాని మహిళ పరువు తీసే విధంగా సమాజం ప్రవర్తిస్తుందని చెప్పే సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ కథ, క్లైమాక్స్‌తో మగాళ్లు ఏకీభవించడం కష్టం. మహిళలు హారతులు పట్టడం, జేజేలు పలకడం పుష్కలం. మహిళల కోసం మగాడు తీసిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. మహిళలు మెచ్చే సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

ఇమ్మోర్టల్

సెప్టెంబర్ 18, 2026

హ్యాపీ జర్నీ

సెప్టెంబర్ 18, 2026

సీక్రెట్ సోల్జర్

సెప్టెంబర్ 18, 2026

మహేంద్రగిరి వారాహి

సెప్టెంబర్ 15, 2026

ఎపిక్

సెప్టెంబర్ 11, 2026

సర్దార్ 2

సెప్టెంబర్ 11, 2026