అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు…?
December 22, 2025 Published by Srinivas

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అరుణ్ కుమార్ గారు ఇచ్చిన తీర్పు భారత న్యాయ వ్యవస్థ లో కొంగొత్త శ్రీకారం నకు చుట్టబోతుంది. ఈ తీర్పు ప్రధానంగా “ముస్లిమ్ ల నినాదాలు” కు సంబంధించినది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలి నగరంలో మత ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన హింసాత్మక నినాదాల కేసులో… అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన లో నిందితులు గా అరెస్టయిన వ్యక్తులు బెయిల్ కోరారు. దీనికి హైకోర్టు న్యాయమూర్తి అరుణ్ కుమార్ ఇది సాధారణ నిరసన కాదు. ఇది హింసకు పిలుపు ఇచ్చి భారత దేశ సమగ్రతను పాడు చేసే కోణం లో ఉంది. ఆలోచించిన పిదప…. ఇది వ్యక్తి స్వేచ్ఛ పరిధిలోకి రాదు. అందుకే బెయిల్ తిరస్కరిస్తున్న అని వ్యాఖ్యానించారు.దేశ సార్వభౌమాధికారానికి మరియు చట్టబద్ధమైన పాలనకు విసిరిన సవాలుగా పరిగణిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.
అసలు ఏమి జరిగింది అంటే…
బరేలి నగరం లక్నోకు సుమారు 250 కి.మీ. దూరంలో… జనాభా ఎక్కువగా ఉండే, మతపరంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. 2024లో జరిగిన మత ఉద్రిక్తత, హింసాత్మక నిరసన సంఘటనల నేపథ్యం లో మత సంబంధిత అంశం మహమ్మద్ ప్రవక్త కు అవమానం జరిగింది అన్న నినాదాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు.
ఆ నిరసనల సమయంలో
“Gustakh-e-Nabi ki ek saza, sar tan se juda”
“గుస్తాఖ్-ఏ-నబీ కీ ఏకీ సజా, సర్ తన్ సే జుదా”
” ప్రవక్త ని అవమానించిన వారి శరీరాన్ని తల నుండి వేరు చేస్తాం అదే శిక్ష” అనే హింసాత్మక నినాదాలుతో రోడ్ల పై ర్యాలీ లు నిర్వహించారు.
దీనికి పోలీసులు, ప్రజలను హింసకు ప్రేరేపించడం, దేశ చట్టవ్యవస్థకు సవాల్ విసరడం, ఇతర వర్గాల శాంతిభద్రతలకు ఆటంకపరచడం, అనే కోణంలో కేసుగా నమోదు చేశారు. దీని పై కోర్టు ఇంకా సవివరంగా వ్యాఖ్యానించింది.
కోర్టు అభిప్రాయం ప్రకారం సామాన్య మతపరమైన నినాదాలు ఇవ్వడం తప్పులేదు ఉదా: “అల్లాహు అక్బర్”, “హర్ హర్ మహాదేవ్” వంటివి సాధారణంగా నేరం కాదు, కాని విభేదాత్మక, హింసాత్మక భావాన్ని రెచ్చగొట్టే నినాదాల ద్వారా , ప్రజాశాంతి, చట్టాలకు విఘాతం కలిగించే వాళ్లను ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది.
శిక్షను… చట్టమే నిర్ణయిస్తుంది” అసలు మీరెవరు….? చట్టాలను చేతిలోకి తీసుకుంటారా…? ఈ వ్యాఖ్యల వెనుక ఉగ్రవాద దృక్పద కోణం ఉంటే సమగ్ర విచారణ జరిపి ఈ కింది విధంగా సెక్షన్లు జోడించామని తీర్పు ఇచ్చింది హైకోర్టు.
- IPC 153A: వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడం.
- IPC 295A: ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం.
- IPC 504/505: ప్రజా శాంతికి భంగం కలిగించేలా ప్రకటనలు చేయడం.
- UAPA: తీవ్రమైన కేసుల్లో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద చర్యలు.
ముగింపు:
అలహాబాద్ హైకోర్టు తీర్పు సారాంశం ఒక్కటే — భారతదేశంలో రాజ్యాంగం మరియు న్యాయవ్యవస్థ మాత్రమే శిక్షను నిర్ణయించే అధికారం కలిగి ఉన్నాయి. హింసను సమర్థించే ఏ నినాదమైనా, అది మతపరమైనదైనా కాకపోయినా, చట్టం ముందు నేరమే.
ఈ తీర్పు భవిష్యత్తులో దేశంలోని అన్ని కోర్టులకు ఒక ప్రామాణికంగ నిలుస్తుంది. అనేక కేసుల్లో సత్వరమే కీలక తీర్పు లు వచ్చే విధంగా మార్గదర్శి కానుంది అని న్యాయకోవిదుల అంచనా.
