భారత మాతాకి జై అంటే నేరమా… ?
డిసెంబర్ 24, 2025 Published by Srinivas

భారత మాతా కి జై అంటే నేరమని కేసు బుక్ చేశారు…. కర్ణాటక పోలీసులు…. 2024 లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ కర్ణాటక లో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ పరంగా నినాదాలు చేస్తూ…. భారత మాతా కి జై అనే నినాదాలు కూడా చేశారు.
కర్ణాటకలోని మంగుళూరు లో ఈ సంఘటన 2024 జూన్ 9న జరిగింది.. వాళ్ళ కు సంబంధించిన నినాదాల క్లిప్పింగ్స్ ఆధారం గా, కర్ణాటక ప్రభుత్వం వాళ్లపై కేసులు పెట్టింది. దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, కర్ణాటక హైకోర్టు.
భారత్ మాతా కీ జై” నినాదం దేశభక్తి భావాన్ని వ్యక్తపరుస్తుంది, అంతేగాని ద్వేషం, హింస, లేదా సామాజిక విభేదాలను ప్రేరేపించేవి కాదు. కేవలం ఈ నినాదాల కారణంతో, IPC 153A (సామాజిక శత్రుత్వం) వంటి సెక్షన్లు పెట్టడం సరైంది కాదు. నేరం గా పరిగణించాలంటే , స్పష్టమైన హింసాత్మక ఉద్దేశం లేదా రెచ్చగొట్టే చర్యలు ఉండాలి.
ఈ కేసులో అలాంటి అంశాలు లేవు అని పోలీసులు నమోదు చేసిన కేసు ను హైకోర్టు రద్దు (Quash) చేసింది.
“భారత్ మాతా కీ జై” అనడం నేరం కాదు; అది ఐక్యతకు దోహదం చేస్తుంది అని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
పోలీసుల విచారణను తగు రీతు లో చేయాలి. అంతేగానీ పై నుండి వచ్చే ఒత్తిళ్ల ను బట్టి కేసులు పెట్టడం కాదు అని సూచించింది . అంటే కేసు నమోదు చేసే ముందు నిబంధనలు వేటికి వర్తిస్తాయో……ఎందుకు వర్తించవో సమగ్ర పరిశీలన చేయాలి అని స్పష్టం చేసింది.
ఇటువంటి తీర్పుల వల్లనైనా…. పోలీసులలో మార్పు వస్తే బాగుంటుంది. పోలీసు విచారణ కరెక్టుగా చేయాలని సోషల్ మీడియా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
