వార్తలు

గ్యాంగ్‌టక్‌లో యువతతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ…

Published by
Rahul N

భారత ప్రధాని Narendra Modi సిక్కిం రాష్ట్ర రాజధాని Gangtokలో సందడి చేశారు. సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకలలో పాల్గొనేందుకు ఆయన గ్యాంగ్‌టక్‌కు చేరుకున్నారు. మంగళవారం జరగనున్న ముగింపు కార్యక్రమాలకు ముందు, ప్రధాని అక్కడి యువతతో కలసి ఉల్లాసంగా గడిపారు.

అధికారిక కార్యక్రమాలకు ముందు కొంత సమయం కేటాయించిన ప్రధాని, స్థానిక యువకులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. క్రీడల ద్వారా యువతతో మమేకమవుతూ, సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. “గ్యాంగ్‌టక్‌లో ఉదయం యువ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడడం చాలా ఎనర్జీ ఇచ్చింది” అని మోదీ తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలని, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించాలని ప్రధాని సందేశం ఇచ్చినట్టుగా భావిస్తున్నారు.

Rahul N