Download App

నేటి ప్రపంచ నాయకులలో… అనితరసాధ్యుడు మోడీ…

మార్చి 4, 2026 By Suresh Thota
అయుతుల్లా ఖమేని మరణం తో, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర వాతావరణం నెలకొంటే…. భారత దేశంలో మాత్రం ఇండియా గెలుస్తుందా… వెస్ట్ ఇండీస్ గెలుస్తుందా అనే మీమాంస లో ఉన్నాడు సగటు భారతీయుడు. దీనికి కారణం ఏమిటి… బలమైన నాయకత్వం. అవును నిజమే బలమైన, తెలివైన నాయకుడు దేశాన్ని పాలిస్తుంటే,...
నేటి ప్రపంచ నాయకులలో… అనితరసాధ్యుడు మోడీ…

అయుతుల్లా ఖమేని మరణం తో, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర వాతావరణం నెలకొంటే…. భారత దేశంలో మాత్రం ఇండియా గెలుస్తుందా… వెస్ట్ ఇండీస్ గెలుస్తుందా అనే మీమాంస లో ఉన్నాడు సగటు భారతీయుడు. దీనికి కారణం ఏమిటి… బలమైన నాయకత్వం.

అవును నిజమే బలమైన, తెలివైన నాయకుడు దేశాన్ని పాలిస్తుంటే, ప్రజలకు అంతకన్నా కావలసింది ఏముంటుంది అంటున్నారు. సోషల్ మీడియాలో లో నెటిజన్లు. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ చర్చల్లో డిఫెన్స్ ఖర్చులపై “ఎప్పుడో జరిగే యుద్ధం కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాలా?” అనే ప్రశ్న లేవనెత్తారు. ఇది MP గారి ప్రశ్న… వీళ్ల పద్ధతి ఎలా ఉంది అంటే “దాహం వేసినప్పుడు బావి తవ్వుదాం”. అనుకునే రకం వీళ్ళు, ఇటువంటి వారిచేతిలో మన దేశ భవిష్యత్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల్సిందే… అని ప్రశ్నిస్తున్నారు.

చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. N. చంద్రబాబు నాయుడు, మరియు YS రాజశేఖరరెడ్డిల మధ్య వ్యత్యాసం గురించి టీవీ డిబేట్స్ లో ఒక పోలిక చెప్పేవారు. అది ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఒక CEO, లాంటి వాడు, 1వ తారీఖున జీతం బ్యాంకులో పడిపోతుంది. జీతం పడుతుందా లేదా అని ఆలోచించక్కరలేదు. స్నేహానికి YS రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ఉండాలి… మన మీదకి మిస్సైల్ వస్తుంది అని చెబితే ఆయన అడ్డంగా నిలబడే వ్యక్తి అని, డిబేట్స్ లో అనేవారు వాళ్ళ గురించి తెలిసినవారు.

ఇప్పుడు మనం చూస్తున్నది మూడో రకం… “నరేంద్ర మోదీ”… సామ, దాన,భేద, దండోపాయలతో ఎటువంటి క్లిష్టమైన సమస్య నైనా తన యొక్క పంథాలో, వ్యూహాత్మకంగా, పరిష్కరించే నేర్పరి. పైన చెప్పినట్లుగా “దాహం వేసినప్పుడు బావి తవ్వే రకం కాదు”… ఆయన నైజం, ఒక అడుగు వెనక్కి తగ్గినా… ముందుకు రెండు అడుగులు వేసినా… ఏదైనా దేశం కోసమే… అని అంటున్నారు.

భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయినప్పుడు, ఒకరోజు యుద్ధం ఆపించి మన విద్యార్థులను, స్వదేశానికి తీసుకువచ్చాడు మోడీ, మన ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన మూలంగా, యుద్ధాన్ని వాయిదా వేశారని, ఆయన పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్ పై దాడి చేశారని, కొందరు అంతర్జాతీయ మీడియా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ ఆసియా దేశాల ప్రజలు యుద్ధ వాతావరణం లో ప్రాణాలు గుప్పిట పట్టి తిరుగుతుంటే, భారత దేశంలో మాత్రం ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ మ్యాచ్ ను, నిన్న మార్చి 1, 2026 న వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌ను, రమారమి 51 కోట్లు వీక్షించారు అని ఒక అంచనా.

ఇదంతా బలమైన రాజకీయ నాయకత్వంతోనే సాధ్యమని, అటువంటి “అనితర సాధ్యుడు మోడీ” అని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading