మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు కాలనీలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ఒక సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ – “ఇది ప్రజల ప్రభుత్వం. పాలన ప్రజల వద్దకు కాదు, ప్రజల మధ్యే జరుగుతుంది. ఇంటింటికీ సుపరిపాలనను తీసుకెళ్తున్నాం. మేము చేసిన పనులను ధైర్యంగా ప్రజల ముందుంచుతున్నాం” అని స్పష్టం చేశారు.
ప్రచారం సందర్భంగా స్థానిక ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. లోకేష్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. ఇంటింటి తిరిగి ‘సూపర్ 6’ పథకాల అమలు, కీలక పథకాలు, అభివృద్ధి చర్యల గురించి వివరించడమే కాకుండా, ప్రజల అభిప్రాయాలను స్వయంగా మంత్రే సేకరించారు.
ఈ కార్యక్రమం ద్వారా మంగళగిరిలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంలో మంత్రి లోకేష్ విజయవంతమయ్యారు. ప్రజల హర్షాతిరేకాల మధ్య ప్రచారం సాగింది.