ఆంధ్ర ప్రదేశ్

మామిడి రైతులకు ఊరట – చంద్రబాబు ప్రభుత్వం రూ. 260 కోట్ల నిధులు విడుదల

Published by
Srinivas

ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప శుభవార్త చెప్పారు. తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం రూ. 260 కోట్లు నిధులు విడుదల చేసింది.

ఈ నిధులు, ముఖ్యంగా తోతాపురి మామిడి కొనుగోలుకు ఉపయోగించనున్నారు. రైతులకు మద్దతుగా ప్రతి కిలోకు ₹4 సబ్సిడీగా మంజూరు చేయబోతున్నారు. మొత్తం 6.5 లక్షల టన్నుల మామిడిని ఈ విధంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ నిర్ణయం, మార్కెట్‌లో తక్కువ ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిత్తూరు జిల్లా రైతులకు పెద్ద ఊరటగా మారింది. అధికారులు తెలిపిన ప్రకారం, రైతులకు మంజూరైన సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. అందుకు రైతులు తమ అకౌంట్లను సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో MIS విధానంలో ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అలాగే, కొనుగోళ్లు 2025 ఆగష్టు వరకు కొనసాగాలని, ప్రాసెసింగ్ యూనిట్లు ₹8 నుండి ₹12 వరకు మద్దతు ధర ఇవ్వాలని వ్యవసాయ శాఖ అభిప్రాయపడుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts