ఆ గ్రామం పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే వాగులు, కొండలు దాటాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు ఆ గ్రామ ప్రజలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా సోలబొంగు గిరిజన గ్రామంలో ప్రాథమిక విద్య కోసం 12 మంది చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీబీసీ ఈ నెల 24న కథనం ప్రచురించింది.
ఈ కథనం మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో, వెంటనే స్పందించి సోలబొంగు గ్రామానికి స్కూల్, రోడ్డు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి లోకేష్, వెంటనే కార్యరూపం కూడా ఇచ్చారు. కేవలం వారం రోజుల్లోనే స్కూల్ ప్రారంభమైంది, రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి.
ఆలస్యం అక్కర్లేదు… నిర్ణయం తీసుకున్న నేత మార్పు తీసుకురాగలడని మరోసారి చాటేశారు మంత్రి నారా లోకేష్.
ఈ నేపథ్యంలో రోడ్డు పనులు జరుగుతున్న చోట జేసీబీ ముందు గిరిజనులు ఆనందభరితంగా థింసా నృత్యం చేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలు గ్రామ ప్రజల ఆశల సాకారానికి ప్రతీకగా మారాయి.
చిన్నారులకు చదువు అందించాలన్న సంకల్పంతో, ప్రభుత్వ యంత్రాంగాన్ని వేగంగా నడిపించిన మంత్రి లోకేష్‌కు గిరిజనులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.