Download App

డ్రగ్స్‌పై యుద్ధం – ఈగల్ టీం రంగంలోకి

జూలై 26, 2025 By Srinivas
"డ్రగ్స్, గంజాయి వద్దు బ్రో" అంటూ యువతలో చైతన్యం నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, డ్రగ్స్‌ రవాణా, వ్యాపారం నిర్మూలనలో దూకుడుకు సిద్ధమైంది. డ్రగ్స్ ముఠాలపై యుద్ధం ప్రకటిస్తూ ప్రత్యేక ఈగల్ టీంను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ఈగల్ టీం ఇప్పటికే డ్రగ్స్ స్మగ్లర్లు,...
డ్రగ్స్‌పై యుద్ధం – ఈగల్ టీంని రంగంలోకి

“డ్రగ్స్, గంజాయి వద్దు బ్రో” అంటూ యువతలో చైతన్యం నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, డ్రగ్స్‌ రవాణా, వ్యాపారం నిర్మూలనలో దూకుడుకు సిద్ధమైంది.

డ్రగ్స్ ముఠాలపై యుద్ధం ప్రకటిస్తూ ప్రత్యేక ఈగల్ టీంను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ఈగల్ టీం ఇప్పటికే డ్రగ్స్ స్మగ్లర్లు, రవాణాదారులపై కఠిన చర్యలు ప్రారంభించింది. రహస్య సమాచారం ఆధారంగా రెగ్యులర్‌గా రైడ్లు చేస్తూ డ్రగ్స్ సరఫరా నెట్వర్క్‌ను కూలదోయడానికి ప్రయత్నిస్తోంది.

ప్రభుత్వం కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, యువతలో డ్రగ్స్‌ మానసిక, శారీరక నష్టాలపై అవగాహన పెంచే దిశగా కూడా కసరత్తులు చేస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, “డ్రగ్స్‌కు దూరంగా ఉండు – జీవితాన్ని సురక్షితం చేసుకో” అనే సందేశాన్ని ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులతో కలిసి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఇంటింటికీ వెళ్లి వివరించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading