Download App

వైసీపీ కుట్రకోణం: ప్రభుత్వంపై బురదజల్లే యత్నం బట్టబయలు

అక్టోబర్ 14, 2025 By Rahul N
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న నకిలీ మద్యం కేసు వెనుక విపరీతమైన రాజకీయ కుట్ర ఉన్నట్టు ఇప్పుడు బట్టబయలవుతోంది. ఈ కుట్ర వెనుక వైసీపీ నేత, ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారని నిందితుడు జనార్ధన్ రావు చేసిన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జనార్ధన్ రావు...
వైసీపీ కుట్రకోణం: ప్రభుత్వంపై బురదజల్లే యత్నం బట్టబయలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న నకిలీ మద్యం కేసు వెనుక విపరీతమైన రాజకీయ కుట్ర ఉన్నట్టు ఇప్పుడు బట్టబయలవుతోంది. ఈ కుట్ర వెనుక వైసీపీ నేత, ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారని నిందితుడు జనార్ధన్ రావు చేసిన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

జనార్ధన్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం, వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ జరిగింది. టిడిపి ప్రభుత్వం రాగానే ఆ కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ తిరిగి తనను సంప్రదించి, “టిడిపి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చేలా మళ్లీ నకిలీ లిక్కర్ తయారు చెయ్యాలి” అని స్పష్టంగా ఆదేశించాడని ఆయన చెప్పారు.

జనార్ధన్ రావు పేర్కొన్నట్టుగా, తంబళ్లపల్లె నియోజకవర్గంలో లిక్కర్ షాపులు తానే తీసుకున్నాడు. జోగి రమేష్ సూచనల ప్రకారం “తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం పై బురద జల్లొచ్చు – అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది” అని చెప్పాడట.

ఇంతటి భారీ రాజకీయ ఆట వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే – కొత్త టిడిపి ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానం రేకెత్తించడం. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మీడియా ద్వారా దాన్ని పెద్ద అంశంగా చూపించడానికి ఈ వ్యూహం పక్కాగా ప్లాన్ చేయబడి అమఆలు చేసినట్లు కనిపిస్తోంది.

ఇక అసలు వ్యవహారం బయటకు రావడంతో వైసీపీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి నేతలు ఇది ఒక “రాజకీయ స్క్రిప్ట్” అని స్పష్టంగా చెబుతున్నారు. ప్రజల ముందు ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడానికి వైసీపీ నాయకులు జరిపిన చీకటి ప్లాన్ అని వారు విమర్శిస్తున్నారు.

జనార్ధన్ రావు బహిర్గతం చేసిన ఈ వాస్తవాలు కేవలం వ్యక్తిగత ఆరోపణలు మాత్రమే కావు – ఇవి రాజకీయ కుట్రకు ప్రతిరూపం. ప్రభుత్వం బలహీనపడాలని, ప్రజల్లో అపనమ్మకం కలగాలని వైసీపీ రూపొందించిన వ్యూహం ఇప్పుడు బహిరంగమైందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం ఈ ఆరోపణలపై ప్రజల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. “వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్లే ప్రయత్నం చేస్తుందా?” అన్న ప్రశ్న సామాన్యుల నోట వినిపిస్తోంది.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading