Download App

సిట్ విచారణ అనంతరం హరీష్ రావు ఫైర్… “నీకు నిజంగా దమ్ముంటే వీడియోను బయట పెట్టు”

జనవరి 21, 2026 • By Rahul N
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన సిట్ విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావుపై జరిగిన విచారణ ముగిసింది. సుమారు ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణ అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విచారణపై స్పందిస్తూ ముఖ్యమంత్రి...
సిట్ విచారణ అనంతరం హరీష్ రావు ఫైర్… “నీకు నిజంగా దమ్ముంటే వీడియోను బయట పెట్టు”

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన సిట్ విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావుపై జరిగిన విచారణ ముగిసింది. సుమారు ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణ అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

విచారణపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన సవాల్ విసిరారు. “నీకు నిజంగా దమ్ముంటే, నన్ను విచారణ చేసినప్పుడు తీసిన వీడియోను బయట పెట్టు. చిల్లర లీకులు ఇవ్వడం మానేయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హరీష్ రావు, “ఇది లీకుల ప్రభుత్వం, స్కాముల ప్రభుత్వం. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు” అని ఆరోపించారు.

తనపై కొనసాగుతున్న విచారణలపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. “ఎక్కడికి పిలిచినా వస్తా. ఎన్నిసార్లు పిలిచినా వస్తా. చట్టంపై నాకు గౌరవం ఉంది. నేను భయపడను” అని అన్నారు.

తమ రాజకీయ బలాన్ని ప్రస్తావిస్తూ, “మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం. రేవంత్ రెడ్డిలా చీకటి రాజకీయాలు మాకు తెలియవు” అంటూ వ్యాఖ్యానించారు.

సిట్ విచారణ ముగిసిన అనంతరం హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచాయి.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading