
నాడు ఐటీతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్, నేడు క్వాంటంతో భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోందని ఐటీ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ అవకాశాల కోసం వెనకపడకుండా పరుగెత్తడం కాదు, భవిష్యత్ టెక్నాలజీని మనమే లీడ్ చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అని ఆయన స్పష్టం చేశారు. ఆ విజన్‌కు ప్రతిరూపమే అమరావతి క్వాంటం వ్యాలీ అని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే టాప్–3 క్వాంటం హబ్స్‌లో అమరావతి నిలవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ తెలిపారు. క్వాంటం స్పీడ్‌తో ముందుకు దూసుకుపోతున్న ఏపీ యువతను చూసి ముఖ్యమంత్రి ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏడవ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు ఏఐ నేర్చుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు.

ఏపీ ఇక టెక్నాలజీ వినియోగదారుడిగా కాకుండా, గ్లోబల్ ఇన్నోవేషన్‌కు దిశ చూపించే నాయకుడిగా మారబోతోందని నారా లోకేష్ స్పష్టం చేశారు. క్వాంటం వ్యాలీ ద్వారా యువతకు నైపుణ్యాలు, పరిశ్రమలకు ప్రతిభ, రాష్ట్రానికి భవిష్యత్ అభివృద్ధి—మూడు ఒకేసారి సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.
