దీని వెనకున్న వారిని వదిలిపెట్టం: కేటీఆర్ ఫైర్
September 24, 2025 Published by Rahul N

తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
“వాళ్ల బాస్ చంద్రబాబు ఆడించినట్లు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు 5 అడుగుల ఎత్తు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అదే సమయంలో 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును రూ.93 వేల కోట్లతో నిర్మిస్తే దానిని అవినీతిగా మలుస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
“93 వేల కోట్లు ఖర్చయినా ప్రాజెక్టుకు లక్ష కోట్లు తిన్నారని ప్రచారం చేశారు. నిజంగా లక్ష కోట్లు తిన్నారంటే ఆ బ్యారేజీలు, పంప్ హౌసులు, సొరంగ మార్గాలు, కాల్వలు, రిజర్వాయర్లు ఎవరు కట్టారు?” అని కేటీఆర్ విసిరిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
అదే సమయంలో నల్గొండలో యూరియా కోసం ధర్నా చేసిన యువ గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ వాడారని ఆరోపించారు. “కులం పేరుతో తిట్టి, ఇంటి నుండి లాగి కొట్టి, నడవలేని స్థితిలోకి తెచ్చారు. దీని మీద మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం. వెనకున్న వారిని వదిలిపెట్టం” అని కేటీఆర్ హెచ్చరించారు.
