ఆయన్ని దృష్టిలో పెట్టుకునే కథ రాసాం: కిషోర్ తిరుమల
జనవరి 12, 2026 Published by Srinivas

మాస్ మహారాజా Ravi Teja హీరోగా, దర్శకుడు Kishore Tirumala దర్శకత్వంలో, నిర్మాత Sudhakar Cherukuri ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ Bhartha Mahasayulaku Vignapthi జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం, విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా రవితేజ వింటేజ్ ఎనర్జీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే కథాంశం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కిషోర్ తిరుమల సినిమా విశేషాలను పంచుకున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ ఎలా ఉండబోతుంది?
ఒక భర్త తన అనుభవం వల్ల మిగతా భర్తలకి ఏం చెప్తున్నాడు.. తను ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు అనేది కథలోని ప్రధాన అంశం.
ఇందులో ఒక ప్రశ్నకి చాట్ జిపిటిలో కూడా సమాధానం దొరకలేదు అన్నారు కదా.. మరి సినిమాలో దొరుకుతుందా?
ఇందులో ఇద్దరు అమ్మాయిలు అడిగిన ప్రశ్న పెళ్లయిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడో ఒక సమయంలో ఎదుర్కొన్నదే. అలాంటి ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఏం సమాధానం చెప్పాలనేది తెలీదు. ఆ ప్రశ్న నిజంగా చాలా కఠినమైనది. దానికి సమాధానం సినిమాలో దొరుకుతుంది.
ఈ కథని ఇల్లాలు ప్రియురాలు కోణంలో కాకుండా చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్.
ఈ సినిమా ప్రమోషన్స్ లో డాన్స్ చేశారు కదా అంత జోష్ ఎలా వచ్చింది?
ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు ఆ సినిమాని ప్రచారం చేయడం కూడా మరో ముఖ్య అంశం. ప్రమోషన్స్ అని కాదు గాని నాకెందుకో ఆ జోష్ అనిపించి డాన్స్ చేశాను. నేను చాలా హ్యాపీగా చేసిన డాన్స్ అది.
ఈ సినిమాలో సత్య నటించిన ఒక పాటకి కొరియోగ్రఫీ కూడా చేశాను. అదొక చిన్న బిట్ సాంగ్. ఆ పాట ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

ఈ కథకి ముందు రవితేజని అనుకున్నారా?
అవునండి. రవితేజతో చేద్దామని అనుకున్న తర్వాతే కథని డెవలప్ చేయడం జరిగింది. ఆయన దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్క్రిప్టు చక్కగా వచ్చిన విధానం చూసి ముందు ఈ సినిమానే చేద్దామని అన్నారు.
మీ సినిమా కథలు సెన్సిబులగా వుంటాయి.. ఈ సినిమా కథ ఎంత ఎమోషనల్ గా సెన్సిబుల్ గా ఉండబోతుంది?
ఇందులో ఇద్దరు అమ్మాయిలు అడిగే ప్రశ్న చాలా సెన్సిబుల్ గా ఉంటుంది. నిజానికి అలాంటి సమస్య వచ్చినప్పుడు గొడవలు పెట్టుకుంటారు. మనస్పర్ధలు పెంచుకుంటారు. విడాకులు కూడా తీసుకుంటారు. మన కోపాన్ని అవతల వాళ్ళని ప్రశ్నించడంలో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కథని చేసుకోవడం జరిగింది. ఐ సినిమాలో విక్రమ్ అంతకుమించి అంటాడు కదా.. ఇందులో ఉండే కాన్ఫ్లిక్ట్ కూడా అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. కచ్చితంగా ఆ ప్రశ్న విని ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. ప్రశ్నలోనే అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అది ఏంటనేది ఆడియన్స్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తారు.
సినిమా చేస్తున్నప్పుడు రవితేజ ఏమన్నారు?
ఆయన చాలా ఎంజాయ్ చేశారండి. రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ నేనేదైతే రాశానో దాన్ని ఫాలో అయ్యారు. నాకోసం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నేను అదే చేస్తానని చెప్పారు. మీరు స్క్రీన్ మీద చూస్తే రవితేజ గారు చాలా ఫ్రెష్ గా ఉంటారు. ఈ సినిమా విషయంలో ఆయన ఇచ్చిన కొన్ని ఇన్పుట్స్ కూడా తీసుకున్నాను.
రవితేజ సినిమా చాలాసార్లు చూశారు. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు
ఈ టైటిల్ ఆలోచన ఎవరిది?
రంగబలి డైరెక్టర్ పవన్ ఈ సినిమా స్క్రిప్ట్ కి పని చేశారు. ఈ టైటిల్ ఆలోచన ఆయనదే.
ఇది మీ ఫస్ట్ సంక్రాంతి సినిమా కదా ఎలా అనిపిస్తుంది?
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాను. మేము అనుకున్నట్టే అద్భుతంగా కుదిరింది. సత్య వెన్నెల కిషోర్ మురళీధర్ గౌడ్ సునీల్.. ఇలా చాలా మంది అద్భుతమైన తారాగణం వుంది. ఇలాంటి మంచి తారాగణంతో సంక్రాంతికి వస్తే ఖచ్చితంగా ఆ వైబ్ పెరుగుతుంది. సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ కి చాలా మంచి స్కోప్ ఉంటుంది. మేము హ్యాపీగా ఉన్నాము.ఆడియన్స్ కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారని పూర్తి నమ్మకం ఉంది.

హీరోయిన్స్ గురించి?
ఆషికా, డింపుల్.. ఇద్దరి క్యారెక్టర్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఇద్దరికీ మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఆషికా పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. డింపుల్ కూడా ఇప్పటివరకు కనిపించని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నారు.
ఇందులో సత్య, వెన్నెల కిషోర్ ట్రాక్స్ హిలేరియస్ గా ఉంటాయి. అలాగే సునీల్ ది కూడా హిల్లెరియస్ క్యారెక్టర్. పెళ్ళాం ఊరెళితే.. దుబాయ్ శీను లాంటి ఫన్ ఉంటుంది.
ఇప్పటివరకు సినిమా చూసిన అందరికి అందరికీ కూడా చాలా అద్భుతంగా నచ్చింది. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్లి థియేటర్స్లో చూస్తే చాలా మంచి హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు.
సుధాకర్ నిర్మాత సుధాకర్ చెరుకూరి గురించి?
సుధాకర్ ఒక నిర్మాత కంటే నాకు ఒక బ్రదర్ ఫ్రెండ్ లాంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మిస్తారు. చాలా సపోర్ట్ చేస్తారు. సినిమా బాగుండాలి బాగా రావాలని తపనపడే నిర్మాత.
మిరాయ్ సినిమాలో యాక్టర్ గా సర్ప్రైజ్ చేశారు కదా.. ఆ జర్నీ గురించి చెప్పండి?
డైరెక్టర్ కార్తీక్ నాకు చాలా క్లోజ్. ఆ సినిమా చేయడం తర్వాత ఒక యాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. నచ్చిన క్యారెక్టర్ వస్తే మనకు ఇష్టమైన డైరెక్టర్ అయితే నటనని కొనసాగించవచ్చు. ఆ సినిమా పార్ట్ 2 లో కూడా నేను ఉండే అవకాశం ఉంది.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
రెండు మూడు కథలు ఉన్నాయి. డివోషనల్ మైథాలజీలో ఒక స్క్రిప్టు. అలాగే మున్నా భాయ్ లాంటి సోషల్ సెటైర్ కథ ఉంది. అయితే ఏది ముందుగా చేయాలనేది త్వరలోనే తెలియజేస్తాను.
