Download App

‘ద్రౌపది 2’లో మహమ్మద్ బీన్ తుగ్లక్‌గా చిరాగ్ జానీ

జనవరి 3, 2026 Published by Srinivas

‘ద్రౌపది 2’లో మహమ్మద్ బీన్ తుగ్లక్‌గా చిరాగ్ జానీ

అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ దర్శకుడు మోహన్‌.జి తెరకెక్కిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది 2’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 14వ శతాబ్దపు దక్షిణ భారతదేశపు నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా తెరకెక్కించారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది.

రిచర్డ్ రిషి పవర్‌ఫుల్ లుక్‌, ఆకట్టుకునే పాటలు, గ్రాండ్ విజువల్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరాగ్ జానీ కీలకమైన విలన్ పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్‌కు చేరాయి.

ఈ సందర్భంగా దర్శకుడు మోహన్‌.జి మాట్లాడుతూ,“చిరాగ్ జానీ మహమ్మద్ బీన్ తుగ్లక్ పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను కేవలం విలన్‌గా కాకుండా, తాను తీసుకునే నిర్ణయాల వల్లే చిక్కుల్లో పడే ఒక శక్తివంతమైన పాలకుడిగా చూపించాం. చరిత్రలో తుగ్లక్‌ను ‘తెలివైన మూర్ఖుడు’గా అభివర్ణిస్తారు. అలాంటి విరుద్ధ లక్షణాలు ఉన్న పాత్రను పోషించాలంటే గంభీరమైన లుక్‌తో పాటు మేధస్సు, తెలివిని సమతుల్యంగా చూపించగల నటుడు అవసరం. ఆ క్లిష్టతను చిరాగ్ అద్భుతంగా ఆవిష్కరించాడు. పాత్రలో పూర్తిగా లీనమై, భయం, గర్వం, ఆలోచన, భావోద్వేగాలు అన్నింటినీ చాలా బలంగా తెరపైకి తీసుకొచ్చాడు” అని ప్రశంసించారు.

‘ద్రౌపది 2’లో మహమ్మద్ బీన్ తుగ్లక్‌గా చిరాగ్ జానీ

‘ద్రౌపది 2’ చిత్రంలో రిచర్డ్ రిషి హీరోగా నటిస్తుండగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. నట్టి నటరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే వై.జి. మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చోళ చక్రవర్తి (నేతాజీ ప్రొడక్షన్స్), జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి నిర్మించారు. ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లను యాక్షన్ సంతోష్ డిజైన్ చేయగా, నృత్యాలను తనిక టోనీ రూపొందించారు. దేవరాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, కమల్నాథన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. పద్మ చంద్రశేఖర్ మరియు మోహన్‌.జి సంయుక్తంగా డైలాగ్స్ అందించారు.

సెన్సార్ ప్రక్రియ పూర్తవడంతో, త్వరలోనే ‘ద్రౌపది 2’ ట్రైలర్ విడుదల చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని తెలిపారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading