Download App

‘అలియాస్ రుక్మిణి’లో ఆడియన్స్‌ను కట్టిపడేసే ఎమోషన్స్.. నిర్మాత ఏమన్నారంటే?

నవంబర్ 28, 2026 • By Srinivas
నేచురల్ స్టార్ నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి...
‘అలియాస్ రుక్మిణి’లో ఆడియన్స్‌ను కట్టిపడేసే ఎమోషన్స్.. నిర్మాత ఏమన్నారంటే?

నేచురల్ స్టార్ నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో నిర్మాత దీప్తి గంటా మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘అలియాస్ రుక్మిణి’ కథ తనకు మొదటిసారి చదివినప్పుడే నచ్చిందని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ చెప్పిన రెండున్నర గంటల నరేషన్‌ను ఎంతో ఆస్వాదించానని, కథలోని ఎమోషన్స్‌తో పాటు క్లైమాక్స్ కూడా తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు.

ఈ సినిమాకు నితిన్‌ను ఎంపిక చేయాలనే ఆలోచన నానిదేనని దీప్తి వెల్లడించారు. కథకు నితిన్ అయితే బాగుంటుందని నాని సూచించారని, కథ విన్న తర్వాత నితిన్ కూడా వెంటనే అంగీకరించారని తెలిపారు. ఇప్పటికే నాని సినిమా చూశారని, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాని సమయం కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.

నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు కథపై చాలా స్పష్టత ఉందని, ఇండస్ట్రీ లెక్కల కంటే తాను నమ్మిన కథను నిజాయతీగా తెరకెక్కించే దర్శకుడని ప్రశంసించారు. సినిమాలోని ప్రతి పాత్ర సహజంగా, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుందని చెప్పారు. హీరోయిన్ కూడా తన పాత్రకు చక్కగా సరిపోయిందని, ఆడిషన్స్ నిర్వహించిన తర్వాతే ఎంపిక చేశామని తెలిపారు.

‘అలియాస్ రుక్మిణి’ టైటిల్ వెనుక కూడా ఆసక్తికరమైన అంశం ఉందని దీప్తి చెప్పారు. రుక్మిణి అనే కలం పేరుతో కథలు రాయడం వెనుక ఉన్న కారణం సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని వెల్లడించారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి జీరో కట్స్‌తో సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు.

సినిమా రన్‌టైమ్ 2 గంటల 17 నిమిషాలని, చాలా క్రిస్పీగా ఉంటుందని నిర్మాత వెల్లడించారు. ప్రేక్షకులు కృష్ణ పాత్రతో ప్రయాణం చేస్తారని, సినిమా ఎప్పుడు పూర్తయిందో కూడా తెలియనంతగా ఎంటర్‌టైన్ చేస్తుందని అన్నారు. విజయ్ అందించిన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

‘అలియాస్ రుక్మిణి’లో ఆడియన్స్‌ను కట్టిపడేసే ఎమోషన్స్.. నిర్మాత ఏమన్నారంటే?

ఈ సినిమా విషయంలో ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోలేదని, ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే తెరకెక్కించామని దీప్తి తెలిపారు. డిసెంబర్ 4న నాగచైతన్య ‘వృషకర్మ’ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో రెండు సినిమాలూ వేర్వేరు జానర్స్‌లో ఉండటంతో ప్రేక్షకులు రెండింటినీ ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఆకాశంలో ఒక తార’ వంటి సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయినట్లే ‘అలియాస్ రుక్మిణి’ కూడా గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని దీప్తి నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా చూసిన తర్వాత కనీసం రెండు రోజుల పాటు ప్రేక్షకులు అందులోని పాత్రలు, వారి ప్రయాణం గురించి మాట్లాడుకునేలా ఒక మంచి అనుభూతిని అందిస్తుందని చెప్పారు.

ఇక తన తదుపరి దర్శకత్వం గురించి మాట్లాడుతూ.. నిర్మాణం నుంచి కొంత విరామం తీసుకున్న తర్వాత మళ్లీ దర్శకత్వం చేపడతానని తెలిపారు. అలాగే ‘కోర్ట్’ ఫేమ్ జగదీష్‌తో తమ నిర్మాణ సంస్థలో మరో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now