HBD OG – LOVE OMI – Glimpse – అతని కత్తికి పదునెక్కువ…
September 2, 2025 Published by Rahul N

వదిలింది ఒక్క నిమిషం.. కానీ అభిమానుల గుండెలకు గట్టిగా తాకుతోంది… OG ప్రొడక్షన్ హౌస్ ఇచ్చిన మాట ప్రకారం HBD OG – LOVE OMI – Glimpse రిలీజ్ చేసింది.
అయితే ఇది మామూలు గ్లింప్స్ కాదు, దర్శకుడు సుజీత్ వినూత్నంగా సినిమాలోని విలన్ పాత్రను పరిచయం చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు.
డియర్ OG నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్నా… నీ OMI అంటూ స్టార్ట్ అవుతుంది గ్లిమ్ప్స్…
“OG” లో పవన్ కల్యాణ్ ఓజస్ గంభీరగా, అంటే OGగా కనిపిస్తారు. ఆయన ఎదురుగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఓమి పాత్రలో నటిస్తున్నారు. ఓజస్‌ని చంపుతానని ప్రతిజ్ఞ చేసే విలన్‌గా ఆయన లుక్, శైలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విడుదల చేసిన గ్లింప్స్‌లో మొదట విలన్ పరిచయాన్ని చూపించారు.
వీడియో ఉన్నది 64 సెకండ్లే అయినా, ఇమ్రాన్ హష్మీ ఊచకోత, థమన్ ఇచ్చిన BGM, చివర్లో వచ్చిన పవన్ ఎంట్రీ స్టైల్ దద్దరిల్లిపోయింది. కత్తి పట్టుకున్న పవన్ కల్యాణ్ రక్తంతో తడిసిన తెల్ల చొక్కాలో కనిపిస్తూ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ ఇచ్చారు. అతని కత్తికి పదునెక్కువ… అన్నట్టుగా ఉంది.
ఈ గ్లింప్స్ ప్రత్యేకత ఏంటంటే—హీరోయిజాన్ని హైలైట్ చేయడానికి ముందు విలన్ శక్తిని ఎస్టాబ్లిష్ చేయడం. ఇందులో వాడిన జపనీస్ స్టైల్ టెక్స్ట్ ఈ సినిమా జపాన్ కనెక్షన్‌పై ఉన్న సంకేతాలు ఇస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకా అర్లు మోహన్ నటిస్తుండగా, మ్యూజిక్ మాంత్రికుడు థమన్ బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు, ఒక టీజర్ విడుదలై మంచి హైప్ క్రియేట్ చేసాయి. తాజాగా వచ్చిన ఈ గ్లింప్స్ ఆ హైప్‌ను మరింత పెంచింది.
“OG – LOVE OMI” పేరుతో విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో, సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే దాదాపు 1 మిలియన్ డాలర్ల మార్క్‌కి చేరుకోవడం ఇండియన్ సినిమాకి కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ తో భారీగా అంచనాలు పెరిగిపోగా, ఇప్పుడు ఇంకో ఎత్తుకు తీసుకెళ్లారు మూవీని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
“OG” సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
