Download App

మిరాయ్: తేజ సజ్జా బర్త్‌డే పోస్టర్

ఆగస్ట్ 23, 2025 • By Srinivas
హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న తేజ సజ్జా, ఇప్పుడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో ఎంటర్‌టైనర్ మిరాయ్ లో సూపర్ యోధగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ...
మిరాయ్: తేజ సజ్జా బర్త్‌డే పోస్టర్

హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న తేజ సజ్జా, ఇప్పుడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో ఎంటర్‌టైనర్ మిరాయ్ లో సూపర్ యోధగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఈ ఏడాది బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌గా నిలవబోతోంది.

బర్త్‌డే స్పెషల్ పోస్టర్ అదరగొట్టింది

తేజ సజ్జా బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన తాజా పోస్టర్ అభిమానుల్లో కొత్త హైప్ క్రియేట్ చేసింది. కూలిపోతున్న వంతెన మీద చేతిలో కేవలం ఒక స్టిక్‌తో నిలబడి పోరాడుతున్న తేజ లుక్ హై వోల్టేజ్ యాక్షన్‌ని రిప్రజెంట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీజర్, సాంగ్ ఇప్పటికే సెన్సేషన్

మిరాయ్ టీజర్ నేషనల్ లెవెల్‌లో మైండ్‌బ్లోయింగ్ రెస్పాన్స్ పొందింది. ఫస్ట్ సాంగ్ వైబ్ ఉంది చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రెండింటితోనే సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

స్టార్ కాస్ట్ & క్రూ

ఈ సినిమాలో రీతికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారు. శ్రీయా శరన్, జయరాం, జగపతి బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను కూడా కార్తీక్ ఘట్టమనేని స్వయంగా నిర్వహిస్తున్నారు. మణిబాబు కరణం రచన, సంభాషణలు అందించగా, గౌరహరి సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ బూస్ట్

హిందీ రిలీజ్ కోసం బాలీవుడ్ టాప్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్ తన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా మిరాయ్ హిందీ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకోవడం మరో ప్రత్యేకత. దీంతో నార్త్ ఇండియాలో కూడా సినిమాకు బలమైన పుష్ దొరకనుంది.

ఎనిమిది భాషల్లో విడుదల

మిరాయ్ 2D, 3D ఫార్మాట్‌లలో ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రూ పాన్-ఇండియన్ విజువల్ వండర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts