అడివి శేష్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డకాయిట్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. లీడ్ క్యారెక్టర్స్‌ను పరిచయం చేసిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌తోనే సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.
ఈరోజు మేకర్స్ మృణాల్ ఠాకూర్ బర్త్‌డే సందర్భంగా ఆమెను పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ అవతార్‌లో చూపిస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో మృణాల్ చేతిలో గన్ పట్టుకొని ఎయిమ్ చేస్తూ కనిపిస్తుండగా, ఆమె కళ్ళల్లో ఆక్రోశం, బాధ, ఫైటింగ్ స్పిరిట్ అన్నీ ఒక్కసారిగా ప్రతిబింబిస్తున్నాయి. ముఖంపై కనిపించే చిన్న గాయాలు, కన్నీళ్లు ఆమె పాత్రలోని లోతైన భావోద్వేగాన్ని తెలియజేస్తున్నాయి.
జూలియట్ పాత్రలో మృణాల్
ఈ కథలో జూలియట్ కేవలం లవ్ ఇంటరెస్ట్ మాత్రమే కాదు. మొత్తం రివెంజ్ డ్రామాకి సెంట్రల్ ఫుల్‌క్రం లాంటిది. మృణాల్ పోషించిన ఈ పాత్ర తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూసిన హీరోయిన్ల క్యారెక్టర్స్ కంటే డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీడ్ యాక్టర్స్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.
డకాయిట్ ఈ క్రిస్మస్ డిసెంబర్ 25, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.