సినిమా వార్తలు

వినాయక చవితి కానుకగా రామ్ చరణ్ ‘పెద్ది’ సెకండ్ లుక్‌ ?

Published by
Srinivas

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదటి షాట్ గ్లింప్స్‌తోనే దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ సృష్టించింది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎప్పుడూ చూడని నెవర్ బిఫోర్ లుక్లో కనిపించబోతున్నారని సమాచారం. టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలీం హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రామ్ చరణ్‌కి కొత్త లుక్ డిజైన్ చేశారు. దీంతో చరణ్ స్టైల్, స్వాగ్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతున్నారని టాక్.

మెగా అభిమానులకు మరోసారి సాలిడ్ ట్రీట్ అందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే చరణ్ పై మరో లుక్‌ను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఇక ఈ రెండో లుక్‌ను రాబోయే కొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వినాయక చవితి కానుకగా ఈ లుక్ రావచ్చని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న విడుదలకానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts