Download App

‘SYG’ షూటింగ్ శరవేగంగా.. ముంబై షెడ్యూల్ పూర్తి

జూన్ 9, 2026 By Srinivas
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం SYG (సంబరాల ఏటిగట్టు)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హనుమాన్ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత PrimeShow Entertainment నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు రోహిత్ కె.పి తెరకెక్కిస్తున్న...
‘SYG’ షూటింగ్ శరవేగంగా.. ముంబై షెడ్యూల్ పూర్తి

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం SYG (సంబరాల ఏటిగట్టు)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హనుమాన్ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత PrimeShow Entertainment నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

దర్శకుడు రోహిత్ కె.పి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ముంబై షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం విశేషం. అయితే ఆ నటుడి వివరాలను మేకర్స్ ప్రస్తుతం గోప్యంగా ఉంచారు.

హనుమాన్ విజయంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, SYGను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తోంది. ఇప్పటికే పూర్తయిన ప్రతి షెడ్యూల్ సినిమా యొక్క విజన్, స్కేల్‌ను ప్రతిబింబిస్తుండగా, అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

‘సంబరాల యేటిగట్టు (SYG)’ గ్లింప్స్: అసుర సంధ్య వేళ మొదలైంది

ముంబై షెడ్యూల్‌లో జాతీయ స్థాయి నటుడు భాగస్వామ్యం కావడం ద్వారా ఈ చిత్రాన్ని నిజమైన పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలన్న మేకర్స్ సంకల్పం స్పష్టమైంది. దేశంలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు భాగమవుతుండటంతో చిత్రంపై జాతీయ స్థాయిలో మరింత ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత శక్తివంతమైన, సవాలుతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, సినిమాలో ఆయన పాత్ర మరో స్థాయిలో ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది. ఈ చిత్రం ఆయన సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలవనుందని చిత్ర వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రపంచ స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో SYGను ఎలాంటి రాజీ లేకుండా నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్లు, అద్భుతమైన విజువల్స్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతుండగా, ప్రతి కొత్త అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో SYG ఒకటిగా నిలుస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading