సినిమా వార్తలు

బేబీ బంప్ తో ఉపాసన కొణిదెల ? రామ్ చరణ్ మళ్లీ శుభవార్త చెప్పనున్నారా ?

Published by
Srinivas

టాలీవుడ్ పవర్ కపుల్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

ఇటీవల ఉపాసన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించారు. ఆ సందర్భంలో ఆమెకు బేబీ బంప్ స్పష్టంగా కనిపించిందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెతో పాటు భర్త రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఉపాసన నెమ్మదిగా నడుస్తూ, తన దుపట్టాతో మిడ్‌సెక్షన్ కవర్‌ చేయడం గమనార్హం కాగా, చరణ్ ఆమె పక్కనే ఉండి జాగ్రత్తగా సహాయం చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

2012లో వివాహం చేసుకున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు, 2023లో తమ మొదటి బిడ్డ క్లిన్ కారా కొణిదెలను స్వాగతించారు. అప్పటి నుండి ఈ జంట సోషల్ మీడియాలో తమ అనుభూతులను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఆఫిషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికే అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

మెగా వారసుడు రావాలి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక ప్రొఫెషనల్ వైపు చూస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో వచ్చే తన తదుపరి చిత్రం 2026 సమ్మర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వీరి ఇంట నుండి మరోసారి శుభవార్త రాబోతుందా? అన్న ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్ అంతా ఎదురు చూస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.