Download App

హిందీ లో రఫ్ఫాడిస్తున్న ‘విశ్వంభర’

ఆగస్ట్ 22, 2025 By Srinivas
బాహుబలి, పుష్ప వంటి చిత్రాలని తెలుగు కంటే నార్త్ ప్రేక్షకులే ఎక్కువ ఆదరించారనడంలో సందేహం లేదు. పెద్ద చిత్రాలనే కాక కార్తికేయ 2 వంటి చిన్న చిత్రాన్ని కూడా పెద్ద ఎత్తున నిలబెట్టారు హిందీ ప్రేక్షకులు. రాజమౌళి ఒక ట్రెండ్ సెట్ చేసినప్పటి నుండి మన తెలుగు చిత్రాలపై...
హిందీ లో రఫ్ఫాడిస్తున్న 'విశ్వంభర'

బాహుబలి, పుష్ప వంటి చిత్రాలని తెలుగు కంటే నార్త్ ప్రేక్షకులే ఎక్కువ ఆదరించారనడంలో సందేహం లేదు. పెద్ద చిత్రాలనే కాక కార్తికేయ 2 వంటి చిన్న చిత్రాన్ని కూడా పెద్ద ఎత్తున నిలబెట్టారు హిందీ ప్రేక్షకులు. రాజమౌళి ఒక ట్రెండ్ సెట్ చేసినప్పటి నుండి మన తెలుగు చిత్రాలపై నార్త్ లో కూడా మక్కువ పెరుగుతోంది.

ప్రస్తుతం బింబిసార వంటి హిట్ చిత్రం తర్వాత దర్శకుడు వశిష్ట, మెగాస్టార్ చిరంజీవి తో ‘విశ్వంభర’ ని తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రూపొందుతోంది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇప్పటికే భారీ ఉత్సాహంతో వేడుకలు జరుపుకుంటుండగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్లింప్స్ నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు.

ఇప్పటికే గ్లింప్స్‌తో మాత్రం అంచనాలను మరింతగా పెంచింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ టీజర్ కి లభిస్తున్న స్పందన విశేషంగా ఉంది.

నిన్న సాయంత్రం విడుదలైన టీజర్ తెలుగులో 12 గంటల్లోనే 2.3 మిలియన్ వ్యూస్ అందుకోగా, హిందీ వెర్షన్ మాత్రం 11 గంటల్లోనే 3.2 మిలియన్ వ్యూస్ దాటి పరుగెడుతోంది. అంటే హిందీ ప్రేక్షకులు టీజర్‌కి మరింత పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు అన్నమాట.

ఈ ట్రెండ్ కొనసాగితే, ‘విశ్వంభర’ నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి బజ్ సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవి పుట్టినరోజు కానుకగా వచ్చిన ఈ టీజర్, అభిమానులకే కాకుండా ఇండియన్ సినీ ప్రేక్షకులందరికీ భారీ విజువల్ ఫీస్ట్ రాబోతోందని సంకేతాలిస్తోంది.

Vishwambhara Hindi Glimpse: Mega Blast

Vishwambhara Telugu Glimpse: Mega Blast

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading