Download App
Movie Poster

Jatadhara

Cast: Sudheer Babu, Sonakshi Sinha, Divya Khossla, Divya Khossla, Shilpa Shirodkar, Shreya Sharma, Indira Krishnan, Subhalekha Sudhakar, Rajeev Kanakala, Ravi Prakash, Jhansi

Director: Venkat Kalyan & Abhishek Jaiswal

Music Director: Rajeev Raj

Producer: Umesh Kumar Bansal, Shivin Narang, Aruna Agarwal, Prerna Arora, Shilpa Singhal , Nikhil Nanda

Banner: Zee Studios

Release Date: November 7, 2025

జటాధర మూవీ రివ్యూ

Published నవంబర్ 8, 2025 by Srinivas

జటాధర రివ్యూ: దొంగ భక్తితో కొలిస్తే దెబ్బలే పడతాయ్

సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన సినిమా ‘జటాధర’. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారి. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

భక్తిరస చిత్రాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. తెరపై దేవుడు కనిపిస్తే చాలు, ఆ సినిమాకు బాక్సాఫీస్‌లో కాసుల వర్షం కురుస్తోంది. అదొక్కటే సుధీర్ బాబు దృష్టిలో పడినట్టు ఉంది. కథ, కథనం, పాత్రలు వంటి బేసిక్స్ గాలికి వదిలేసి సినిమాను శివుడు కాపాడతాడని ‘జటాధర’ చేయడానికి అంగీకరించినట్టు ఉన్నారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ప్రేక్షకులు ఎవరికైనా సరే సినిమా చూశాక ‘అసలు ఎందుకు చేశారు?’ అని ప్రశ్నించాలని అనిపిస్తుంది.

జటాధర రివ్యూ

కథ:

కథ గురించి చెప్పాలంటే… దెయ్యాలు, భూతాలు, ఆత్మలు లేవని నమ్మే వ్యక్తి శివ (సుధీర్ బాబు). మంచి ఉద్యోగం, ప్రేమ కురిపించే తల్లిదండ్రులు ఉన్నా బాల్య స్నేహితుడి మరణం వల్ల ప్రపంచానికి దెయ్యాలు లేవని చెప్పాలని రాత్రుళ్ళు వాటిని వెతకడం మొదలు పెడతాడు. శివ అన్వేషణ అతడిని రుద్రారం గ్రామానికి తీసుకు వెళుతుంది. అక్కడ ఓ ఇంటిలో ధన పిశాచి (సోనాక్షి సిన్హా) ఉంటుంది. శివకు, ధన పిశాచికి సంబంధం ఏమిటి? 

విశ్లేషణ:

సినిమా ఎలా ఉందంటే… భక్తితో కొలిచిన ప్రజలకు వరాలు ఇవ్వడం భగవంతుడు చేసే పని. దొంగ భక్తితో కొలిస్తే దెబ్బలు పడతాయ్ – అది నిజమని చెప్పడానికి చక్కటి ఉదాహరణ ‘జటాధర’. విడుదలకు ముందు సుధీర్ బాబు ‘కార్తికేయ 2’ ప్రస్తావన తీసుకొచ్చారు. అందులో కృష్ణుడి సన్నివేశానికి వచ్చిన స్పందన, తమ సినిమాలో శివుని సన్నివేశానికి వస్తుందన్నారు. కృష్ణుడి గురించి అనుపమ్ ఖేర్ చెబుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ‘జటాధర’లో శివుని గురించి చెబితే ఏ విధమైన స్పందన కలగదు.

Jatadhara Movie Review

‘ఖలేజా’లో ‘ఓం నమో శివః రుద్రయా’ అంటూ పాట వస్తుంటే తన్మయత్వంతో వింటాం. అంతకు మించి గొప్పగా చెబితే భక్తి భావన కలుగుతుంది. భారీ విజయం కోసం శివుణ్ణి వాడుకోవాలని చూస్తే ఈ విధంగా ఉంటుంది. శివుడి సన్నివేశాన్ని సరిగా రాసుకోలేదు సరి కదా… దారుణంగా తీశారు. సీరియల్స్‌లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ‘జటాధర’తో పోలిస్తే వందరెట్లు మెరుగ్గా ఉంటాయి. విజువల్స్ ఒక్కటే కాదు… రచన, సంగీతం, దర్శకత్వం, నటన వంటి అంశాల్లో ఒకరితో మరొకరు పోటీపడి మరి ప్రేక్షకులు ‘ఛీ’ కొట్టే కంటెంట్ ఇచ్చారు. సీజనల్ ఆర్టిస్టులు శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, రవిప్రకాష్ తమకు రొటీన్ క్యారెక్టర్లు ఇచ్చినా ఎంతో కొంత నిలబెట్టాలని ప్రయత్నించారు. హీరో హీరోయిన్లు, ఇంపార్టెంట్ రోల్ చేసిన స్టార్లలో ఆ తపన కనిపించలేదు. ఎటువంటి ప్రభావం చూపించలేదు.

Jatadhara Movie Review

తీర్పు:

ఫలానా సన్నివేశం బావుందని, ఫలానా పాట బావుందని, ఫలానా స్టార్ బాగా చేశారని విశ్లేషించడానికి ఏమీ లేని సినిమా ‘జటాధరా’. స్నేహితుల సహనానికి పరీక్ష పెట్టాలనుకుంటే ఈ సినిమా టికెట్ కొని థియేటర్లకు పంపండి. ఎంత సహన శీలులైనా మధ్యలో వాకౌట్ చేసి బయటకు రావడం ఖాయం. సినిమాలో శివుడు ఉన్నాడు. కాని భక్తి కనిపించదు. అది దొంగభక్తిలా అనిపిస్తుంది.

Rating: (2/5)

మరిన్ని వార్తలు

No categories found.