అమెరికా 500% టారిఫ్ విధిస్తే… భారత్ లొంగుతుందా ?
జనవరి 9, 2026 Published by Srinivas

అమెరికా ప్రతి వాడి కలల సౌధం… చదువు, సంపద, టెక్నాలజీ అన్నిటిలోనూ మిన్న గా ఉన్న దేశం. ఈ దేశానికి నిర్దేశకత్వం వహిస్తున్న అధ్యక్షుడు ట్రంప్… తన పై వచ్చిన అభియోగాల నుండి దేశం యొక్క దృష్టి మళ్లించడానికి అనేక సర్కస్ ఫీట్లను చేస్తున్నాడు. అందులో భాగం గానే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ని అమెరికా కు పట్టి తీసుకురావడం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ని అవహేళన గా మాట్లాడటం. ఇలా అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం మనదేశం పై 50% పన్ను విధించాడు. ఇప్పుడు తాజాగా 500% పన్ను విధించాలని ప్రతిపాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా అధికారికంగా అమల్లోకి రాలేదు.
ఇది ప్రధానంగా రష్యా నుండి ఇంధనం (crude oil) కొనుగోలు చేస్తున్న దేశాలపై గట్టిగా ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి ఉద్దేశించబడింది. ఉక్రెయిన్ , రష్యా యుద్ధ నేపధ్యంలో…. రష్యాను తన దారికి తెచ్చుకోవడానికి , భారత్ పై పన్నులు విధించబోతున్నాడు. భారత్ రష్యా వద్ద క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు రష్యా తమ దారికి రావడం లేదని ఒక రకమైన ఉక్రోషంతో ఉంది అమెరికా. అందుకే ఈ టారిఫ్ బిల్లు ను (Sanctioning Russia Act of 2025) సెనెట్‌లో…సెనేటర్స్ లిండ్సే గ్రాహం మరియు రిచర్డ్ బ్లూ మెంథల్ ప్రతిపాదించారు . ఇందులో రష్యా వర్కింగ్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ టారిఫ్‌లు పెట్టే ప్రతిపాదనను అందులో రూపొందించారు. ఇది కేవలం ప్రతిపాదన చట్టంగా పాస్ కాకపోతే అమలవ్వదు.
భారత దేశం ఎవరితోనూ కయ్యానికి కాలుదువ్వదు. మన దేశం వివిధ రకాల వ్యూహలతో ముందుకు వెళుతుంది. సామ, దాన, భేద, దండోపాయలతో ముందుకు వెళుతుంది. ముందు దౌత్య (Diplomatic) మార్గం… మొదటి ఆయుధం.
భారత్ ఇప్పటికే అమెరికాకు స్పష్టం చేస్తోంది. రష్యా చమురు కొనుగోళ్లు భారత్ జాతీయ ఇంధన భద్రత కోసం మాత్రమే అని చాలా సార్లు చెప్పింది. యూరప్ కూడా రష్యా నుండి దిగుమతులు మానలేదు, అలాగే మా దేశ అవసరాలకోసం మాత్రమే మేము రష్యా నుండి దిగుమతులు చేసుకుంటున్నాము అనే వాదనను భారత్ బలంగా వాదిస్తుంది.
అమెరికన్ కాంగ్రెస్ లో పెట్టబోతున్న ఈ బిల్లును చట్టంగా మారకుండా అడ్డుకోవడం లేదా భారత్‌కు మినహాయింపు ఇచ్చే విధంగా వెసులుబాటు పొందడం. చట్ట పరంగా ఎదుర్కోవాలంటే గనక, ఈ (500%) టారిఫ్ అమలైతే….WTO (World Trade Organization) లో కేసు వేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇంత భారీ టారిఫ్…. అంతర్జాతీయ స్వేచ్ఛ వ్యాపార నియమాలకు (Free Trade principles) ఈ పన్ను విధానం విరుద్ధం అని భారత్ వాదించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అమెరికాని హెచ్చరిస్తున్నారు.
భారత్ “లొంగదు… ఢీకొట్టదు.. సమతుల్యత” అనే వ్యూహంతో ముందుకు వెళ్తుంది. గతంలో స్టీల్, అల్యూమినియం టారిఫ్‌ల విషయంలో భారత్ ఇదే మార్గం ఎంచుకుంది.
అమెరికా నిజంగా కఠిన చర్యలు తీసుకుంటే…. భారత్ కూడా ప్రతీకార టారిఫ్‌లు (Retaliatory tariffs) విధించే అవకాశాలు ఉన్నాయి. భారత్ కూడా US దిగుమతులపై పన్నులు పెంచవచ్చు. బాదం, యాపిల్స్, మెడికల్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, మొదలగునవి. ఇది చిట్టచివరి ఆయుధం… కాని ప్రయోగించే అవకాశముంది. దీనితో పాటు అమెరికా పై ఆధారపడటం తగ్గించి సొంతం గా అభివృద్ధి సాధించేలా జాగృతమవడం. ఇతర దేశాల మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని మన వ్యాపార మార్గాలను విస్తృతంగా పెంచుకోవడం.
USA లేకపోయినా భారత్ వ్యాపారం నిలబడగలదు, చేయగలదు అన్న సంకేతం బలంగా ఇవ్వడం ద్వారా… మిగతా దేశాలకు ఆదర్శంగా నిలవడం ముఖ్యం అంటున్నారు. మన దేశం లో విదేశీ వ్యవహారాలపై అవగాహన ఉన్న నిపుణులు.
రష్యా తో క్రూడ్ ఆయిల్ కొనడం భారత ఆపదు. అది భారత దేశ ప్రధాని మోడీ అలాంటి ఒత్తిడి లకు లొంగే తత్వం ఉన్న వ్యక్తి కాదు. ట్రంప్ కూడా ఇగో ఉన్న వ్యక్తినే…మొండిగా టారిఫ్ విధిస్తే USA కంపెనీలకే ఎక్కువ నష్టం, భారత్‌ను దూరం చేసుకుంటే చైనా లాభపడుతుంది. ఇది ఖచ్చితంగా జరిగే పని కాదు, అమెరికా కే ఎక్కువ నష్టం అని అంతర్జాతీయ నిపుణులు అమెరికాని హెచ్చరిస్తున్నారు.
అందుకే… 500% టారిఫ్ నిజంగా అమలయ్యే అవకాశం తక్కువ అని విశ్లేషకుల అభిప్రాయం.
సారాంశం… భారత ఎప్పుడూ ఒత్తిడి కి లొంగదు. అదే నేటి భారతం.
