Download App

ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్… సునిశితంగా పరిశీలిస్తున్న భారత్…

ఫిబ్రవరి 27, 2026 By Suresh Thota
"కత్తి పట్టుకున్నాడు ఆ కత్తికే బలి అవుతాడు" అని ఒక సామెత. ఇది పాకిస్తాన్ విషయంలో నూటికి నూరుశాతం కరెక్ట్ అవుతుంది. ప్రపంచ ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్తాన్… తాలిబన్ అనే "కొరివితో తల గోక్కుంటుంది". రష్యా మరియు అమెరికా దేశాలే ఆఫ్ఘనిస్తాన్ ను ఏమి చేయలేకపోయాయి. పాకిస్తాన్ మరియు...
ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్… సునిశితంగా పరిశీలిస్తున్న భారత్…

“కత్తి పట్టుకున్నాడు ఆ కత్తికే బలి అవుతాడు” అని ఒక సామెత. ఇది పాకిస్తాన్ విషయంలో నూటికి నూరుశాతం కరెక్ట్ అవుతుంది. ప్రపంచ ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్తాన్… తాలిబన్ అనే “కొరివితో తల గోక్కుంటుంది”. రష్యా మరియు అమెరికా దేశాలే ఆఫ్ఘనిస్తాన్ ను ఏమి చేయలేకపోయాయి.

పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నడుమ యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ కి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానంతో పాటు, జెట్ ఫైటర్స్ ను కూల్చివేసామని, అంతేకాకుండా సరిహద్దు వెంబడి ఉన్న పాక్ సైనికులపై దాడి చేసి 55 మందిని కాల్చి చంపామని ప్రకటించింది. పాకిస్తాన్ మొన్న జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా సమాధానం చెబుతుంది. పాకిస్థాన్ “ఆపరేషన్ గజబ్ లిక్ హక్” పేరుతో అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది.

దక్షిణాసియాలో మరోసారి భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న కాల్పులు, పరస్పర ఆరోపణలు ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపుతున్నాయి. రెండు దేశాలూ ఒకదానిపై మరొకటి మిలిటెంట్ గ్రూప్ లకు ఆశ్రయం ఇస్తున్నాయనే అంశం పై ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా “డ్యూరండ్ లైన్” సరిహద్దు వివాదం…. 19వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలో ఖరారు చేసిన ఈ రేఖను పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుగా భావిస్తే, ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అధికారికంగా అంగీకరించడం లేదు. ఈ వివాదం కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ కాల్పులు, రాకెట్ దాడులు చోటుచేసుకుంటున్నాయి.

2021లో తాలిబన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పాకిస్తాన్ తమ భూభాగంపై దాడులు చేస్తున్న తేహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కార్యకలాపాలకు కాబూల్‌లోని పాలకులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తోంది.

సరిహద్దు ప్రాంతాల్లోని పాక్ సైనిక శిబిరాలపై దాడులు చేసి 13 అవుట్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు పేర్కొన్నారు . ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పాకిస్తాన్ వైమానిక దాడుల వల్ల తమ పౌరులకు, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు చనిపోయారని దీనికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకుంటుందని అంటుంది.

భారత్ చాలా సునిశితంగా ఈ పరిణామాలను పరిశీలిస్తుంది. దక్షిణాసియా దేశాలు తో పాటు, అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిస్థితిలను జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి..

ఆఫ్ఘనిస్తాన్ , పాకిస్తాన్ సంబంధాలు భౌగోళిక, జాతి, మత, భద్రతా అంశాలతో ముడిపడి ఉన్నాయి. పూర్తి స్థాయి యుద్ధం రెండు దేశాలకు కూడా ఆర్థికంగా, రాజకీయంగా నష్టదాయకమే. అందువల్ల సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ, దౌత్యపరమైన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు.

ఈ దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితి “సైనిక ఒత్తిడి – దౌత్య చర్చలు” అనే ద్విముఖ వ్యూహంలో సాగుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, భవిష్యత్తులో మళ్లీ మధ్యవర్తిత్వం చేపట్టే అవకాశాన్ని అంతర్జాతీయ విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు.

మరోవైపు పాకిస్థాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, తమకు భారీ నష్టం జరిగినట్లు అధికారికం గా వెల్లడించలేదు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading